బాక్సింగ్ డే టెస్టులో పట్టుబిగించిన భారత్

బాక్సింగ్ డే టెస్ట్ రెండొవ రోజు భారత జట్టు 443 /7d పరుగుల వద్ద డిక్లెర్ ఇచ్చింది .రెండొవ రోజు ఆట ప్రారంభించిన పుజారా ,కోహ్లీ నిదానంగా ఆడుతూ కోహ్లీ హాఫ్ సెంచరీ,పుజారా సెంచరీ పూర్తి చేసారు . ఇండియా స్కోర్ 293 పరుగుల వద్ద స్టార్క్ వేసిన షార్ట్ పిచ్ బంతికి కోహ్లీ (83 ) అవుట్ అయ్యాడు దింతో 170 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది.299 పరుగుల వద్ద పుజారా కూడా అవుట్ అయ్యాడు .తర్వాత వచ్చిన రహానే ,రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ 62 పరుగుల భాగస్యామ్యాన్ని నమోదు చేసారు. ఇన్నింగ్స్ 361 పరుగుల వద్ద రహానే(34) అవుట్ అయ్యాడు .తర్వాత వచ్చిన రిషబ్ పంత్ తో కలిసి రోహితశర్మ వేగంగా ఆడటంతో ఇండియా స్కోర్ 400 పరుగులు దాటింది.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు .ఇన్నింగ్స్ 437 పరుగుల వద్ద రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన జడేజా కూడా వెంటనే అవుట్ కావడం తో ఇన్నింగ్స్ ని 443 పరుగులవద్ద డిక్లెర్ ఇచ్చాడు .
అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 6 ఓవర్లు లో వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసారు క్రీజ్ లో హర్రీస్ (5),ఫించ్ (3) పరుగులతో వున్నారు.

Leave A Comment