జైషే మహ్మద్ మసూద్ అజహర్ అంతర్జాతీయ ఉగ్రవాది : ఐక్యరాజ్యసమితి

జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింన ఐక్య రాజ్య సమితి

 

నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా గొప్ప దౌత్యపర విజయం సాధించింది. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లుగా జరుపుతున్న దౌత్యపరమైన కృషి కారణంగా చైనాపై అంతర్జాతీయంగా వత్తిడి తీసుకు రావడంతో జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా నేడు ప్రకటించింది.

అతడిని ఐరాస బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టకుండా చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్‌దే పైచేయి సాధించింది.

అజార్‌ విషయంలో చైనా పెట్టిన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చడానికి మార్గం సుగమం అయింది.

డ్రాగన్‌పై అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ పతాక స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు చైనా దిగొచ్చింది. మరోవైపు ఐరాస ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే పాక్‌ కూడా స్పందించింది. ఇతడికి గ్లోబల్‌ ఉగ్రవాది ట్యాగ్‌ ఇవ్వడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

అతడిని బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చినట్లు భారత అంబాసిడర్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ప్రకటించారు. ‘ మసూద్ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చింది.

Leave A Comment