భారీగా ఆశా వర్కర్ల జీతాల పెంపు : ఆనందం లో ఉద్యోగులు

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నారు.
వృద్ధాప్య పింఛను 2250 చేయడం కిడ్నీ భాదితులకు 3000 నుంచి 10000 వేల వరకు పింఛన్ పెంచడం రాష్ట్రంలో లో మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టడం తో పాటు నేడు మరొక నిర్ణయం తీసుకున్నారు అదే ఆశా వర్కర్ల జీతాలు పెంచడం.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేళా మంది ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర లో ఆశా వర్కర్లు తమ జీతాల పెంపు అంశంపై వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్న విషయం తెలిసిందే అయితే జగన్ మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆశా వర్కర్లు అందరికి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన హామీ ప్రకారం నేడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆశా వర్కర్లు అందరికి జీతాలను పెంచుతున్నామని ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం వీరికి 3000 రూపాయల గౌరవ వేతనాలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే అయితే వీరి వేతనాలు 3000 నుంచి 10000 వేల రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు .

Babygaru
తమ జీతాల పెంపు పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు తమ సంతోషాన్ని వెల్లడించారు , ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంగం అధ్యక్షురాలు బేబీ గారు మాట్లాడుతు ముఖ్యమంత్రి గారు తమ కోరికను మన్నించి తమ జీతాలను పెంచడం పై తామెంతో సంతోషంగా ఉన్నామని తెలియజేసారు.

Leave A Comment