హంతకుడిని పట్టుకోండి.. వివేకానందరెడ్డి హత్య పై జగన్ ఆదేశం

వై ఎస్ వివేకానందరెడ్డి గారిని ఎన్నికలకు ముందు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ విషయం పై పోలీస్ అధికారులు తప్ప మరెవరూ జోక్యం చెసుకోకూడదని హైకోర్ట్ గట్టిగానే చెప్పింది.ఇకపోతే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి.

jagan mohan reddy

ఇప్పుడు తాజాగా బాబాయి హత్య కేస్ పై విచారణ చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను అదేశించారట.
అయితే పులివెందులలోని తన స్వగ్రామం లో బాత్రూములో అత్యంత పాశవికంగా హత్యకు గురైన సంఘటనలో పోలీసులు ఇప్పటికే వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ని, ఆయన అనుచరుడు దొండవాగు శంకర్ ను ఇంటి పనిమనిషి కుమారుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్ కు తరలించారు.

అప్పటి నుంచి ఈ కేస్ పై ఎటువంటి పురోగతి కనిపించలేదు ఇటీవల వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత గారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తాడేపల్లి లోని స్వగృహంలో కలిసి ఎలాగైనా సరే హంతకులను పట్టుకోవాలని అన్న ను కోరారట దీని పై స్పందించిన జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ హంతకులను వదిలేది లేదని కచ్చితంగా వారికి పట్టుకుని వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట.

dgp-savangh

అందులో భాగంగానే డీజీపీ సవాంగ్ కు ఈ కేస్ ను అప్పచెప్పారట ఈ సందర్భంగా  హంతకులు ఎంతటివారైనా వారి వెనుక ఎంత పెద్ద వారు ఉన్న సరే ఎవర్ని వదిలిపెట్టోదని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ గారు   సవాంగ్ కు సూచించారట

Leave A Comment