కొత్త ఎత్తుగడ తో చంద్రబాబు ! కేసుల నుంచి తప్పించుకోవడానికేనా ?

ఆంధ్రప్రదర్శ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తుగడను వేసిందా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు కారణం గతం లో అధికారం లో ఉన్న టీడీపీ చేసిన అవినీతి నుంచి తప్పించుకోవడం ప్రస్తుతం అధికారం లో ఉన్న వైసీపీ వారి ఎక్కడ తమ బండారం బయట పెడతారో అనే అనుమానం తో ఆ పార్టీలోని కొందరు ముఖ్యనాయకుల కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ లోకి చేరబోతున్నారన్న వార్తలే ఇందుకు నిదర్శనం .

ఇకపోతే ఇదంతా చంద్రబాబు గారి సూచనల మేరకే జరుగుతుందని భోగట్టా ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం హయాంలో చాలా చోట్ల అడ్డగోలు అవినీతి జరిగిందని రాష్ట్రానికి వచ్చిన నిధులను బినామీ పేర్లతో తమ అనుయాయులకు తరలించారని కొందరు నేతల ఆరోపణ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ , పట్టిసీమ ప్రాజెక్ట్, ప్రభుత్వం చేసిన ఓవర్ డ్రాఫ్ట్ అప్పులు గురించి వాటి ఖర్చుల గురించి అడిగినా టీడీపీ వారు వాటి వివరాలు చెప్పిన దాఖలాలు లేవు.ఇకపోతే రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏవిధంగా ఖర్చు పెట్టారన్న విషయాన్ని కూడా నివేదిక ఇవ్వమని కోరితే దానిపై టీడీపీ నాయకుల స్పందన కరువైంది

మరో పక్క కొందరు మంత్రులు, రాజ్యసభ సభ్యులు వేల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టిన వైనం అందరికి తెలిసిందే ,ఎన్నికల వేళా టీడీపీ వారు బీజేపీ పై చేసిన ఆరోపణలు అన్ని ఇన్నీ కావు,అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అధికారం వారి చేతుల్లోనించి వైసీపీ కి మారింది ఇక్కడే అసలు కథ మొదలయ్యింది అధికారంలోకి వచ్చి రాగానే అందరి లెక్కలు తెలుస్తా అని చెబుతున్నారు ఇక్కడే టీడీపీ వారందరికీ భయాలు మొదలయ్యాయి అసలే మొండివాడు అందునా అధికారం చేతుల్లో ఉంది , తాము రాజకీయం గా బ్రిటికి ఉండాలంటే కచ్చితంగా అధికార పార్టీల మద్దతు కావాలి లేకపోతే అంతే సంగతులు.

సరిగ్గా ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ చాణక్యతను చూపారు తన బినామీ ఆస్తులు కాపాడుకోవలన్నా ,తన పై భవిష్యత్ లో ఏవైనా కేస్ లు వచ్చినా వాటినుంచి తప్పించుకోవాలన్నా తనకోక అండ కావాలి అది కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ కావాలి మరి ఎలా ఇప్పటికే చాలా సార్లు మోడీ ని బీజేపీ ని అడ్డగోలుగా తిట్టాం కదా! అందుకే తనకేమీ తెలియదని తనని మోసం చేశారని నమ్మించడానికి కొత్త ఎత్తుగడను వేశారు అందులో భాగంగానే ఆయన ఫారెన్ ట్రిప్ వెళ్లడం అతని బినామీ లు బీజేపీలో చేరిపోడం చకచకా జరిగిపోయాయి.. ఇంతకీ వీరు బీజేపీ లో చేరడానికి ముఖ్యపాత్ర పోషించిన నాయకుడు ఎవరో కాదు వెంకయ్య నాయుడే స్వయంగా టీజీ వెంకటేశ్,సీఎం రమేష్, సృజన చౌదరీ, గరికపాటి రాం మోహన్ లను బీజేపీ లో చేర్చి తన పై రాబోయే కేస్ లనుంచి తప్పించుకోవడానికి ఈ రకం డ్రామా కు తెరలేపారు చంద్రబాబు.
పైకి మాత్రం తాను ఊర్లో లేని సమయం చూసి తమ పార్టీవాళ్ళని లాక్కున్నారని కళ్ల బొల్లి కబుర్లు చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నట్టున్నారు

Leave A Comment