రోడ్డు ప్రమాదానికి గురైన చలాకి చంటి

జబర్దస్త్ హాస్య నటుడు , టాలీవుడ్ హాస్య నటుడు అయినా చలాకి చంటి రోడ్డుప్రమాదానికి గురయ్యారు . వ్యక్తిగత పని మీద కోదాడ వెళ్లిన చంటి ఆ పనిని ముగించుకుని హైదరాబాద్ బయలుదేరగా మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని కొమరబండ వద్ద లారీని వెనుకభాగం లో చంటి ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొంది .

ఈ సంగటనలో చంటి కి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం ఆయన కారు కూడా ముందుభాగం పూర్తిగా పాడైపోయినట్టు తెలిసింది , గాయాల పాలైన చంటిని హుటాహుటిన స్థానిక ప్రయివేట్ హాస్పిటల్ చేర్చి ప్రాథమిక చికిత్సను అందించిన అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి .

chalaki chanti
ప్రస్తుతం కేర్ హాస్పిటల్ లో ఆయనకు వైద్యం కొనసాగుతుంది ప్రస్తుతం అయన బాగానే ఉన్నారని ప్రమాదంలో తగిలిన గాయాలు ప్రాణతకం కాదాని కానీ కొన్ని బలమైన గాయాలు కావడం వలన ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు

Leave A Comment