పింఛన్ పెంపు ఫైల్ పై ముఖ్యమంత్రి తొలి సంతకం

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో తన మొదటి సంతకాన్ని వృద్ధాప్య పింఛన్ పెంపు ఫైల్ పై చేశారు.

ప్రస్తుతం రెండువేల రూపాయలు ఉన్న ఫింఛను 3000 చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అయితే ఆ హామీని నిలబెట్టుకునే విధంగా 2000 రూపాయలు ఉన్న పింఛన్లు జూన్ 1 వ తారీకునుంచి 2250 రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించారు అందుకుగాను తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు .

ఇకపోతే ప్రతి సంవత్సరం పించనును 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని తద్వారా రానున్న 4 ఏళ్ళల్లో తాము చెప్పిన విధంగా 3000 రూపాయలు పించనును రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార వేదికగా తెలియజేసారు. రాష్టం లో ఇప్పటికే ఉన్న పింఛన్ లబ్ది దారులే కాక ఇక మీదట అర్హులైన ప్రతి ఒక్కరికి జూన్ నెల నుండి 2250 రూపాయల పింఛన్ అందనుంది

Leave A Comment