ఉద్యోగం పేరిట 25 లక్షలకు టోకరా వేసిన నరసరావుపేట వైద్యుడు

అతనో గౌరవప్రదమైన వైద్యవృత్తిని చేస్తున్న వైద్యుడు వైద్యం మీద ఆదాయం బాగానే వస్తుంది , వచ్చే సంపాదన సరిపోలేదేమో మరింత డబ్బు సంపాదించడానికి   పిల్లనిచ్చిన మామ తో కలిసి ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేయడం ప్రారంభించాడు ఈ క్రమం లో గుంటూరు జిల్లా నరసారావు పేట పట్టణానికి చెందిన ఒక యువకుడి కి అమెరికా లో ఉద్యోగం అంటూ ఆశచూపి 25 లక్షలు నొక్కేసాడు తీరా ఉద్యోగం ఏదని నిలదీస్తే తప్పించుకు తిరుగుతున్నారు .

వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా నరసరావుపేట ఎన్జీవో కాలనీలో నివాసం ఉండే వీరవల్లి శ్రీమన్నారాయణకు ఇద్దరు కుమార్తెలు ఒకరేమో అమెరికాలో ఉద్యోగం చేస్తుంటారు మరొకరు స్థానికంగా వైద్యశాలను నడుపుతున్నారు , శ్రీ మన్నారాయణ . అతని చిన్న కూతురు డాక్టర్ రమ్య , అల్లుడు అశ్వనీకాంతలు నరసరావుపేట లో ఉండే దిలీప్ అనే వ్యక్తికి అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి  పలు  దఫాలుగా 25 లక్షలు తీసుకున్నారు డబ్బైతే తీసుకున్నారు గాని ఇంతవరకు ఉద్యోగం ఇప్పించలేదు అదేంటని అడిగితె ఏవేవో సాకులు చెప్పి తప్పించుకు తిరుగుతున్నాడు.

ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న పెద్ద కూతురు విద్య పట్టణం లో ఉన్న చెల్లెలి హాస్పిటల్కి వచ్చిందన్న విషయం తెలుసుకున్న బాధితుడు తన ఉద్యోగం తెలుసుకుందామని తన బంధువులతో అక్కడికి వెళ్లగా వారు భాదితుడిపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశారు , బాధితుడి తరపు బంధువులు ఆగ్రహించడం తో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది విషయం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్సై బిలాలుద్దీన్ అక్కడికి వెళ్లి భాదితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బాధితుడు మాట్లాడుతూ తనను మోసం చేసి డబ్బు కాజేశారని ఎలాగైనా తన డబ్బు తనకు ఇప్పించాలని వారిపై పిర్యాదు ఇచ్చాడు. పోలీసులు శ్రీ మన్నారాయణ . అతని చిన్న కూతురు డాక్టర్ రమ్య , అల్లుడు అశ్వనీకాంత్ ,పెద్ద కూతురు విద్య లపై చీటింగ్ కేసు ను నమోదు చేశారు.

Leave A Comment