ఏపీ ముఖ్యమంత్రి పై జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా మారిపోయారని అంటున్నాడు సినీ హీరో జె.డి చక్రవర్తి. హిప్పీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు సినీ హీరో జె.డి చక్రవర్తి.

ఆయన కీలకపాత్రలో నటించిన ’హిప్పీ’ చిత్రం గురువారం విడుదలైన మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? అని విలేకరి జె.డి ని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘2008లో నాకు యాక్సిడెంట్‌ అయ్యింది. నడవలేని పరిస్థితి. ఓసారి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. నేను కూర్చున్న సీటు సౌకర్యంగా లేదు. దాంతో వీల్‌ఛైర్‌ కావాలని అడిగాను. అయితే ఆ సమయంలో నా పక్కనే జగన్‌ ఉన్నారు.

కనీసం ఆయన నన్ను చూసి కూడా పలకరించలేదు. ఆయన ప్రవర్తన చూసి షాకయ్యా. గతేడాది మళ్లీ విమానాశ్రయంలో జగన్‌ను చూశా. అప్పుడు ఆయన ‘ఎలా ఉన్నారు?’ అంటూ నన్ను పలకరించారు.

అప్పట్లో జగన్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వారుకాదని ఆ తర్వాతనాకు తెలిసినిది అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ అందరితో కలివిడిగా మాట్లాడటం అందరిని కలుపుకు పోవటం నేర్చుకున్నారని ఇన్నేళ్లలో జగన్‌లో ఎంతో మార్పు వచ్చింది’ అని వెల్లడించారు జేడీ.

Leave A Comment