జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పెను దుమారం రేపుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. ఘటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులు మైనర్లు అయినప్పటికీ వదలొద్దని స్పష్టంచేశారు. నిందితులు చిన్నవారైనా, పెద్దవారైనా కఠినంగా శిక్షించాలన్నారు.
నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం అని అభిప్రాయపడ్డారు. దోషుల కుటుంబాలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ఇటులో కూడా ఏపీలో తరుచూగా ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని పవన్ వాపోయారు. సమైలంగా నిర్మూలించాలని ఆయన కోరారు.