మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత దిగ్బ్రాంతికి లోనైన చంద్రబాబు నాయుడు

మాజీ స్పీకర్ కోడెల కన్నుమూత దిగ్బ్రాంతికి లోనైన చంద్రబాబు నాయుడు టిడిపి నాయకులు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు నేడు ఉదయం జూబ్లీహిల్స్ లోని తన ఇంటిలో మరణానికి గురయ్యారు అయితే ఆత్మహత్యకు పాల్పడిన ఆయనను కుటుంభం సభ్యులు గమనించి హాస్పిటల్కు తరిలించేలోగా చనిపోయారు

శివప్రసాద్ గారి మరణం తో అటు కుటుంబ సభ్యుల మరియు పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని నిలిపింది
తనను నమ్మిన వారికి పార్టీకి ఏళ్ళ తరబడి అండగా ఉంటూ ప్రత్యర్థులకు దీటుగా నిలిచినా ఈయన నేడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందరిని విస్మయానికి గురిచేసింది.

అయితే గత కొన్ని రోజులుగా అధికార పక్షం నుంచి మరో వైపు సొంత పార్టీలోని కొందరు నేతల నుంచి భారీ ఎత్తున ఆరోపణలు రావడం తెలిసిందే అయితే ఇప్పటివరకు ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంతవరకు తెలిసి రాలేదు
మరో వైపు కొందరు అభిమానులు ఆయన ఆత్మహాత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదని అసలేం జరిగిందో తెలియక భాదపడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న కొందరు అభిమానులు భారీ ఎత్తున శివప్రసాద్ గారి ఇంటి వద్దకు తరలి వస్తున్నారు ఏది ఏమైనా టిడిపి పార్టీ ఒక బలమైన నాయకున్ని కోల్పోవడం బాధాకరమైన విషయం .. దీనిపై టిడిపి నాయకుడు బచ్చుల అర్జునుడు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం యొక్క కక్షపూరిత చర్యల వలెనే నేడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు

Leave A Comment