అమృతకు అణా పైసలు కూడా ఇవ్వను : మారుతీ రావు

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనను కాదని ప్రేమావివాహం అందునా కులాంతర వివాహం చేసుకోవడంతో కక్ష గట్టిన తండ్రి మారుతీరావు గత ఏడాది సెప్టెంబర్ 14 వ తారీకున ప్రణయ్ ను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన విషయం అందరికి తెలిసిందే సుదీర్ఘ రిమాండ్ అనంతరం బెయిలు పై బయటికి వచ్చిన మారుతీరావు తన కష్టార్జితమైన ఆస్తిలో చిల్లి గవ్వకూడా తన కూతురు అమృతకు చెందకుడదని వీలునామా రాశారు.

marutheerao

అయితే ప్రణయ్ హత్యకు పక్కా ప్రణాళికతో మాజీ ఐ ఎస్ ఐ తీవ్రవాదులతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో తొమ్మిది నెలల సుదీర్ఘ దర్యాప్తు జరిపి అనంతరం ఈ కేస్ కు సంబంధించిన 1600 పేజీల చార్జీషీట్ ను ఉన్నతాధికారులకు ఆయన బుధవారం నాడు అందజేశారు.

sp-ranganath-nalgonda

ఇంకా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి మొత్తం 120 మంది సాక్షులను విచారించిన తర్వాత 8 మంది నిందితుల పాత్ర ఉందని ,మారుతీరావు పూర్తి అవగాహనతో ఉద్దేశ పూర్వకంగానే ఈ హత్య చేయించారని ఆయన తెలిపారు.ప్రణయ్ హత్యకోసం కోటి రూపాయలు ఒప్పందం కుదుర్చుకుని కరీం అనే వ్యక్తి ద్వారా భారీ ,అసర్గ్ అలీ అనే వ్యక్తులతో ఒప్పందం చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన ఛార్జ్ షీట్ లో తెలిపారు.

Leave A Comment