రాష్ట్రంలో ఎన్నికలు సరైన పద్ధతి లో జరగలేదు : పవన్ కళ్యాణ్

సరైన పద్దతిలో ఎన్నికలు జరగలేదు
జనసేన అధినేత ఎన్నికల సరళి పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు నిన్న శుక్రవారంనాడు తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి , గుంటూరు, విజయవాడ నాయకులతో మంగళగిరి జనసేన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక్క ఆంద్రప్రదేశ్ లొనే కాకుండా దేశంలో ని చాలా చోట్ల ఎన్నికలు సరైన పద్దతిలో జరగలేదని చాలా చోట్ల evm లు సరిగా పనిచేయలేదని ఆయన అన్నారు.
అయితే గెలిచిన నాయకులందరికి మరోసారి ఆయన అభినందనలు తెలిపారు .

మనం ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలవ్వడం కాస్త నిరాశనిచ్చిందని అంత మాత్రాన మనం దిగులు పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు ఇకపోతే ఈ ఓటమి నుంచి మనం పాఠం నేర్చుకోవాలని ఈ ఎన్నుకలను ఒక అనుభవం గా తీసుకుని రానున్న రోజుల్లో పార్టీ తరపున ప్రజల తరపున మరింత కృషి చేయాలని ఆయన తెలిపారు.

ఇకపోతే రానున్న రోజుల్లో జనసేన నే ప్రజల కష్టాలను తీరుస్తుందని ఆయన తెలిపారు ,ఈ సందర్భంగా ఆయన జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ ను అభినందించారు నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు

Leave A Comment