ప్రజా వేదిక కూల్చడం మంచిదే : పవన్ కళ్యాణ్

 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా వేదికను కూల్చి మంచిపని చేసారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ప్రజావేధికను కూల్చడానికి మంగళవారం రాత్రి నుంచే పనులు మొదలెట్టారు ప్రస్తుతానికి ప్రజా వేదిక మొత్తం నేలమట్టం చేశారు అధికారులు దీనిపై అటు టీడీపీ వైసీపీ మిగిలిన రాజకీయ పార్టీలనుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో దీనిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి .

గుంటూరు జిల్లా నంబూరు లో దశావతార వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో నిర్వహించిన 108 కళశాల పూజలో పూజలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ అక్రమంగా కట్టిన ప్రజావేధికను కూల్చివేయడం మంచి పనే ఒక్క ప్రజా వేధికతోనే సరిపెట్టకుండా రాష్ట్రంలో అన్ని చోట్లా ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు, అనుమతులు లేకుండా కట్టిన భవనాలు ఉన్నాయో గుర్తించి వాటిని కూడా కూల్చివేయాలి అని డిమాండ్ చేశారు అలా చేస్తేనే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం వస్తుంది ఒక వేళ అలా చేయలేని పక్షంలో ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు అని ఆయన అన్నారు

Leave A Comment