2024 లో ఒక్కొకడికి చుక్కలే : నాగబాబు

సినీ నటుడు , జనసేన నాయకుడు నాగబాబు 2024 వ సంవత్సరం లో తన తమ్ముడు పవన్ కల్యాణ్ చుక్కలు చూపిస్తాడని అన్నాడు నా ఛానెల్ నాయిష్టం పేరుతో అతను యూట్యూబ్ లో వీడియోలు చేసాయడం తెలిసిందే అందులో భాగంగా ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ 2024 లో వచ్చే ఎన్నికల్లో జనసేన కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు.
గడిచిన ఎన్నికల్లో ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని గెలిచినవారు గొప్పోళ్ళు కాదు ఓడిపోయిన వారు చేతకాని వారు కాదు చాలా మంది ఈ ఒక్కసారి జగన్ కి ఓటేస్తామని పవన్ కి ఓటేసినా ప్రభుత్వం ఏర్పాటుచేస్తాడాని నమ్మకం తమకు లేదని తనతో చెప్పారని అన్నారు.
చంద్రబాబు గారి పై ఉన్న వ్యతిరేకత , రాజశేఖర్ రెడ్డి పై ఉన్న సానుభూతి, ఎక్కువశాతం ప్రజల మధ్య ఉంటూ పాదయాత్ర చేయడం జగన్ కు కలిసొచ్చింది అంతే తప్పితే ఆయానేమి గతంలో పాలన చేయలేదని కేవలం సానుభూతి తోనే గెలిచాడని అన్నాడు.
ఇకపోతే ఓడిపోవడానికి తానుకూడా కారణమని ఎక్కువ శాతం ప్రజల్లో లేకపోవడంతో మేము ఒడిపోవాల్సివచ్చింది అంతే కానీ ఇందులో ప్రజల తప్పు ఎంతమాత్రం లేదు అని నాగబాబు అన్నాడు

Leave A Comment