తిరిగిరాని లోకాలకు విజయ నిర్మల గారు

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు.

1946 ఫిబ్రవరి 20న జన్మించిన విజయనిర్మల 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో సినీరంగప్రవేశం చేశారు. తొలిచిత్రం మీనా. 14 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈమె 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.

1971లో ఆమె దర్శకత్వబాధ్యతలు చేపట్టారు 2002 లో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఈమెకు గిన్నిస్ బుక్ లో చోటు లభించింది విజయనిర్మల నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం.

Leave A Comment