తన కోరికను నిరాకరించిందని వివాహితపై హత్యాయత్నం

మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తాజాగా హైదరాబాద్ లో ఓ సంఘటన చుట్టుపక్కల వారిని కలవరానికి గురి చేసింది,పెళ్ళైన ఓ వివాహితను ప్రేమించమని పెళ్లి చేసుకోమని కుదరకపోతే తన కోరికను తీర్చమని ఓ యువకుడు వేధింపులు చేస్తున్నాడు కాదన్న ఆమెను చివరకు ఆ యువకుడు కత్తి తో దాడి చేసి పరారయ్యాడు.
వివరాల్లోకి వెళితే
ఫిలింనగర్ ప్రాంత వినాయక నగర్ లో భర్త తో కలిసి జీవించే మహిళకు టోలి చోకి కి చెందిన ఓ యువకుడి తో పరిచయం ఉంది వీరు ఇరువురు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వారు ఈ క్రమంలో వివాహిత పై మోజు పెంచుకున్నాడు ఈ క్రమంలో ఆమెను తనను ప్రేమించాలని , పెళ్లి చేసుకోవాలని కుదరకపోతే తనను శారీరకంగా సుఖపెట్టాలని ఇబ్బంది పెట్టాడు అయితే ఈ విషయం తన భర్త కు తెలిస్తే ఎక్కడ గొడవలు అవుతాయో అని ఆమె ఎవ్వరికీ చెప్పకుండా ఉంది.

ఇదే అలుసుగా భావించిన అతను ఆమె పై వేధింపులు ఎక్కువ చేయడం తో ఆ మహిళ ఈ విషయాన్ని తన బావ తో చెప్పుకుని వాపోయింది సదరు బావ ఆ యువకుడిని కలిసి మందలించగా కక్ష పెంచుకున్న యువకుడు సోమవారం వివాహిత ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యం చేసాడు ఆమె ప్రతిఘటించడం తో ఆమె పై కత్తి తో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యాడు ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను ఉస్మానియా వైద్యశాల కు తరలించారు
ఆ యువకుడి పై సదరు మహిళ భర్త బంజారాహిల్స్ లో కేస్ నమోదు చేయగా పోలీసులు ఆ యువకున్నీ పట్టుకుని స్టేషన్లో పెట్టారు .
ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉంది

Leave A Comment