జర్నలిస్టులకు జగన్ వరాలు.. త్వరలోనే హామీల అమలుకు కార్యాచరణ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి గా నెరవేర్చుకుంటూ వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీల అమలు పై దృష్టి సారించారు నిన్న
ఐ అండ్ పిఆర్ మంత్రి తో ప్రత్యేక భేటీ లో ఈ విషయం పై ప్రత్యేకంగా చర్చించారట .. పాదయాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా ఇంకా మిగిలిన అంశాలపై కూడా చర్చ జరిగిందట వీర్ చర్చలో ముఖ్యంగా కొన్ని అంశాలపై సమీక్ష జరిగింది అవి
1.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
2.తెలంగాణ తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం
3.ఏ పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి అని నిర్ణయం
4.స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు … కాలేజ్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు
5.రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం…
6.వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5 వేలు గౌరవ వేతనం నియోజకవర్గం,రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10 వేలు గౌరవ వేతనం
7.పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల పెన్షన్
చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రబుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని నిర్ణయం
8.జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకం
9.20 లక్షల వరకూ వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీం
10.అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలి అని నిర్ణయం
11.సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం.

పైవన్నీ కూడా జర్నలిస్టులకు ఇవ్వాలని వీటి పై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని అదికారులను అదేశించారట .త్వరలోనే వారికి ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామని ఆయన మరోమారు అధికారులతో వెల్లడించారు

One Comment

  1. Santosh Kandi-Reply
    June 21, 2019 at 12:13 pm

    amazon news portal is very nice.

Leave A Comment