త్వరలో కె.ఏ పాల్ బయోపిక్ ? పాల్ గా సునీల్?

కె.ఏ పాల్ అనే పేరు వినపడగానే చాలా మంది మొహాల్లో నవ్వు వికసిస్తుంది అలా అని ఆయానేమి కమెడియన్ కాదు ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసిన ఒక గొప్ప వక్త , ప్రపంచంలోని ఎందరో మహామహులు సైతం అతని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసారు , సొంతంగా బొయింగ్ విమానం కలిగిన ఏకైక వ్యక్తి , కానీ అదంతా గతం ఇప్పుడు కె.ఏ పాల్ అంటే కేవలం రాజకీయ ఎన్నికల సమయంలో తన అల్లరి పనులతో అందరిలో నవ్వుల పాలైన వ్యక్తి ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ? కానీ ఏం చేసిన అది చూసే వారికి మాత్రం కామెడీ గానే అనిపిస్తుంది.

అటువంటి వ్యక్తి జీవిత కథ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో లో చిత్రం గా రాబోతుంది ఓ కొత్త దర్శకుడు త్వరలో ఈయన జీవిత కథను సినిమా గా తెరకెక్కించబోతున్నారు ఇంతకి ఇందులో హీరో ఎవరో తెలుసా ఇంకెవరు మన సునీల్ ఏ . కామెడీ ని పండించడంలో సునీల్ దిట్ట , తాను చేసే పనులతో నవ్వు తెప్పించడం లో కె.ఏ పాల్ దిట్ట ఇక పాల్ పాత్రను సునీల్ పోషిస్తున్నారు అంటే ఆ చిత్రం ఇంకెంత నవ్వులు పోయిస్తుందో అయితే ఇంతవరకు ఈ సినిమా పై ఎటువంటి అధికార ప్రకటన విడుదల అవ్వలేదు కానీ ఈ సినిమా గురించి పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతుంది

Leave A Comment