మెగాస్టార్ చిరంజీవి : ఆల్ ది బెస్ట్ పహిల్వాన్

కన్నడలో ఫిలిం ఇండస్ట్రీ లో  మంచి పేరు తెచ్చుకున్నారు హీరో సుదీప్.తనను కన్నడ ప్రజలు కిచ్చా …అని ముద్దుగా పిలుచుకుంటారు.    తాను కన్నడ తో పాటు తెలుగు భాషలోనూ నటించారు.

సుదీప్ మంచి హీరో గానే కాకుండా విలన్ గా ను మనకు సుపరిచేతుడే అదే నండి మన ఈగ  సినిమాలో సమంతను విలన్ గా సుదీప్ బయపెడితే…మన నాని ఈగ …సుదీప్ ని భయపెట్టే సీన్ లో తన నటనను ,నైపుణ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించాడు.

అలాగే  సినిమా చరిత్రలోనే చెరగని ముద్ర వేసిన బాహుబలి లోను సుదీప్ మంచి పాత్రలో నటించారు.ఆ తరువాత తనకు ఎన్నో అవకాశాలు అంది  పుచ్చుకున్నారు, ఐతే  ఇప్పుడు సుదీప్ కన్నడలో ఒక మూవి చేస్తున్నారు.అందులో సుదీప్ కుస్తీ వీరుడిగా,బాక్సర్ గా కనిపించనున్నారు.

ఆయన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలు ఆ చిత్రాన్ని తెలుగు లోను   విడుదల  చేయనున్నారు. ఈ సినిమా  కి “పహిల్వాన్’పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.తాను ఒక పహిల్వాన్  లా కనిపించటానికి సుదీప్ చాల కసరత్తులు చేశారు.

పహిల్వాన్ చిత్రానికి అర్జున్ జన్యా సంగీతం అందించగా సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ జోడి కట్టారు. కబీర్ దుహాన్ సింగ్ విలన్‌గా కనిపించనున్నారు.ఇక  బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో  కనువిందు చేయనున్నారు.

అయితే పహిల్వాన్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కిల్లింగ్ లుక్స్‌లో సుదీప్ నిజమైన పహిల్వాన్‌లా ఉన్నాడని…ఈ రియల్ పహిల్వాన్ తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాడని ట్వీట్ చేశారు….

kichha sudeep phailwan

*మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయిన సుదీప్ ఈ సినిమా తో బ్లాక్  బాస్టర్ హిట్ అందుకోవాలని కోరుకుందాం…!
• .అల్ ది బెస్ట్ సుదీప్…

Leave A Comment