యూవీ క్రియేషన్స్ ఇంకా టీ సిరీస్ నిర్మాన సంస్థలు సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం సాహో బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం తో ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు.

saho-prabhas
ఇకపోతే ఇప్పటికే చాప్టర్1 చాప్టర్2 అంటూ కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్ర బృందం విడుదల చేసి సాహో పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు అయితే ఈ రోజు చిత్ర బృందం సాహో అఫిషల్ టీజర్ ను విడుదల చేశారు ఈ టీజర్ లో ప్రభాస్ యాంగ్రీ యంగ్ లుక్ లో తన నటనతో అదరగొట్టాడు అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా టీజర్ను అద్భుతంగా ఉండేలా విడుదల చేశారు చిత్ర బృందం ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న చిత్రం టీజర్ తో మరింత అంచనాలను పెంచేసింది .

saho-teeser
ఆగస్టు 15 వ తారీకున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధకపూర్ నటిస్తున్నారు ఇకపోతే నిలినిథిన్ ముకేశ్, విజయ్ అరుణ్, జకీష్రాఫ్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు..
మరి సాహో ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలంటే ఆగస్టు 15 వ తారీకు వేచి చూడక తప్పదు
అల్ ది బెస్ట్ సాహో టీమ్

 

టీజర్  పై మీరు కూడా ఓ లుక్కేయండి

 

Leave A Comment