క్రికెటర్ గౌతమ్ గంబీర్ పై చర్యలు తప్పవు : ఎన్నికల అధికారి

ఇండియన్ స్టార్ క్రికెటర్ ఈ మధ్యనే క్రికెట్ ని వదిలేసి బీజేపీ పార్టీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.తూర్పు ఢిల్లీ లో ఉన్న సిట్టింగ్ ఎంపి మహేష్ గిరి స్థానంలో గంభీర్ ను నిలబెట్టింది బీజేపీ అయితే తూర్పు ఢిల్లీ లోక్ సభ నుంచి పోటీ చేస్తున్న ఈ క్రికెటర్ పై ఢిల్లీ ఎన్నికల అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనికి కారణం ఈ నెల 9వ తారీఖున నామినేషన్ సందర్భంగా అనుమతి లేకుండా భారీ రోడ్ షో నిర్వహించారని దీనిపై కేసు నమోదు చేయవలసిందిగా ఎన్నికల అధికారి తూర్పు ఢిల్లీ పోలీస్ లను కోరడం జరిగింది .

ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటున్న గంభీర్ కు ఇదొక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన అతిసి ఈ క్రికెటర్ పై రెండు ఓటర్ కార్డులను కలిగి ఉన్నాడని ఒకటి కారోల్ బాగ్ లో మరొకటి రాజేందర్ నగర్ ఉందని ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టాడని ఈ విషయాన్నీ ఎన్నికల అఫిడవిట్లో ఎక్కడ పొందుపరచలేదని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసాడు .

ఒక వేళా ఈ అభియోగం నిరూపితమైతే సెక్షన్ 125A కింద ఆరు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన వాదన ఇకపోతే
ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాల కు మే 12 న పోలింగ్ జరుగుతుంది . మే 23 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది

Leave A Comment