రష్యా, చైనా తర్వాత మనమే

భారత అంతరిక్ష రంగం వినూత్న ఘనత సొంతం చేసుకుంది, అంతరిక్ష రంగంలో ప్రపంచంలో నాల్గో స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. ఈ మేరకు ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ఒక ప్రసంగంలో తెలిపారు. మిషన్ శక్తి విజయవంతం అవడంపై స్పందించారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్ అని తెలిపారు. మన శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో ఎల్ఈఓ శాటిలైట్ ను కూల్చివేశారని తెలిపారు. ఏ శాట్‌ ఆర్బిట్‌ శాటిలైట్‌ను కేవలం 3 నిమిషాల్లోనే కూల్చేసింది. భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి. యుద్ధ వాతావరణం ఏర్పరచడం మన ఉద్దేశం కాదని తెలిపారు. భారత్ శాంతిని కోరుకుంటోందని పేర్కొన్నారు. భారత్ స్పేస్ పవర్ గా అవతరించిందన్నారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత స్పేస్ పవర్ గా భారత్ ఏర్పడిందన్నారు.

ప్రపంచంలోనే స్పేస్ పవర్ గా మారిన నాల్గో దేశం భారత్ అని పేర్కొన్నారు. ఈ మిషన్ అంతిమ లక్ష్యం భారత్ ను సురక్షితంగా ఉంచడం, అభివృద్ధి చేయడమేనని తెలిపారు.దేశంలోని మేధావులను, విధ్యావంతులను చూసి గర్వపడుతున్నానని మోదీ తెలిపారు. మిషన్ శక్తిని విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. ఓ శాటిలైట్‌ను పేల్చే పరీక్షను భారత్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అగ్ర దేశాలు స్పేస్ ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంల భారత్.. యాంటి శాటిలైట్లన నిర్మించడం అత్యవసరం. అంతరిక్ష ఆయుధాలు భవిష్యత్తులో ఎక్కువగా వాడే అవకాశాలు ఉంటాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ శక్తిని చేపట్టారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్ష యుద్ధం కోసం భారత్ సిద్ధంగా ఉందన్న సంకేతాన్ని కూడా మోదీ వినిపించారు. ఈ సందర్బంగా డీఆర్డీఓ శాస్త్ర వేత్తలు 300కిలోమీటర్ల ఎత్తునున్న సాటిలైట్ ను పేల్చి నూతన శకాన్ని లిఖించారని ప్రశంసించారు.

One Comment

  1. April 15, 2019 at 9:08 am

    Great article.

Leave A Comment