ఏలూరు లో దారుణం వివాహితపై అత్యాచారం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో ఓ వివాహిత మహిళపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు వివరాల్లోకి వెళితే..

ఏలూరు ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళ స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా పని చేస్తుంది ఆమె సోమవారం తనకు సోదరి వరసయ్యే ఆమె వివాహానికి తన మిత్రుడు తో కలిసి హాజరయ్యారు వివాహ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి ఒకే బైక్ పై ఇంటికి తిరుగు ప్రయణమయ్యారు.

కొంత దూరం వెళ్లిన తర్వాత వట్లూరు హౌసింగ్ బోర్డ్ వద్దనున్న నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో వీరి బైక్ ఆగిపోవడం తో ఎవరైనా వేస్తారేమో అని ఎదురుచూస్తుండగా అటుగా వచ్చిన ముగ్గురు ఆటో డ్రైవర్లు వీరిని చూసి వీరి వద్దకు వచ్చారు.

అయితే వీరి ప్రవర్తన కాస్త తేడాగా ఉండటం తో ఆ ఆటో డ్రైవర్లు ఆ వివాహిత తో పాటుగా ఉన్న స్నేహితుణ్ణి మందలించిగా అతను అక్కడినుంచి పారిపోయాడు. ఇదే అదనుగా భావించిన ముగ్గురు ఆటో డ్రైవర్లు వివాహిత ను పారిపోకుండా గట్టిగా పట్టుకుని దౌర్జన్యం గా ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.

వారి పని ముగించుకుని ఆమెను అక్కడే వదిలివేయడం తో ఆమె బాధ పడుకుంటూనే ఎలాగోలా ఇంటికి చేరుకుంది
జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల కు చెప్పగా వారు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేశారు వైద్య పరీక్షల నిమిత్తం వివాహితను ప్రభుత్వ వైద్యశాల లో చేర్పించారు.

eluru police station
విచారణ చేపట్టిన పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తులు ముగ్గురు ఆటో డ్రైవర్లు అని వారు వన్నెకూటి నవీన్ కుమార్, కొమ్మిన అనిల్ కుమార్ , పొలిమెట్ల దుర్గారావు లు గా గుర్తించారు ప్రస్తుతం వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు
ఏది ఏమైనా ఆర్డరాత్రులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది లేకపోతే ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది

Leave A Comment