పగలు టిక్ టాక్ .. రాత్రులు దొంగతనాలు

 

అతనో టిక్ టాక్ హీరో , ప్రముఖులకు సైతం లేని ఫ్యాన్ ఫాలోయింగ్ అతని సొంతం , ఎక్కడికెళ్లినా చుట్టూ మూగే జనం అతని అందానికి అమ్మాయిలైతే పడి చచ్చే వారు కూడా , అందరిలో ఓ సెలబ్రిటీ హోదా ఇవన్నీ కేవలం ఒక్క టిక్ టాక్ వీడియోలతో సంపాదించిందే పగలంతా టిక్ టాక్ వీడియో లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అతను రాత్రులు మాత్రం దొంగతనాలపై అతి శ్రద్ధ పెడతాడు ఇంతకీ ఎవరా చోర శికామని అనుకుంటున్నారా ??

abhimanyu-tik tok

అతని పేరు అభిమన్యు గుప్తా ఇతను ఉండేది ముంబైలోని కుర్లా ప్రాంతంలో బెయిల్ బజార్ లో ఇతగాడు రోజులో కనీసం ఒక్క టిక్ టాక్ వీడియో అయినా చేయంది నిద్రపోడు అదే ఇతని టాలెంట్ ,ఇతనిలో ఈ టాలెంట్ తో పాటు దొంగతనాలు చేసే టాలెంట్ కూడా బాగానే ఉంది అయితే అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అలా ఒక చోట దొంగతనం చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.

ఈ ఏడాది జనవరి నెలలో ముంబైలోని ఒక వృద్ధ జంట ఇంటిలో ఇతగాడు దొంగతనం చేసాడు అయితే ఆ వృద్ధ దంపతులు ఆ ఏరియా లొనే కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు అవ్వటం వలన పోలీస్ లు డీ చోరీ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ విచారించారు , దర్యాప్తులో భాగంగా సీసీ కెమేరా లు పరిశీలించిన వారికి ఈ దొంగ దొరికాడు.

మొదట ఇతగాడు నేను ఎటువంటి దొంగతనం చేయలేదని పోలీసులను బుఖాయించాడు అయితే పోలీసులు తమదైన రీతిలో విచారించగా ఆఖరికి నిజం ఒప్పుకున్నాడు తాను దొంగిలించిన 150 గ్రాముల బంగారం మొబైల్ ఫోన్ ఇంకా బంగారం అన్నిటి నగదు విలువ మొత్తం 4.5 లక్షల ఉంటుంది వీటన్నిటిని అమ్మి ఆ డబ్బుతో బంగారం కొని వాటిని తన స్నేహితుడి వద్ద దాచి పెట్టనని చెప్పడం తో పోలీసులు అతని స్నేహితుణ్ణి కూడా అదుపులోకి తీసుకోగా అవి తన భార్య నగలు అని చెప్పి నాదగ్గర దాచిపెట్టడని అతను చెప్పడం తో నగలను స్వాధీనం చేసుకుని అతన్ని విడిచి పెట్టారట.

అయితే మన దొంగని మాత్రం కటకటాల్లోకి నెట్టారు ఇదొక్కటే కాదండోయ్ ఇతగాడి పై ఇప్పటికే 5 చోట్ల ఇలానే దొంగతనం కేస్ లు ఉన్నాయట అయితే ఇతని అదృష్టం బాగుంది వాటన్నిటిలో ఒక్క దానికి కూడా సరైన సాక్ష్యం లేనందున అవేవి నిలబడలేదు కానీ ఇప్పుడు మాత్రం జైలు లో ఊచలు లెక్కబెడుతున్నాడు

Leave A Comment