ప్రేమించాడు పెళ్లిచేసుకోమంటే పారిపోయాడు

యువత ప్రేమపేరుతో తమజీవితాలను నాశనం చేసుకుంటున్నారు రోజురోజుకి ఈ ప్రేమవ్యవహారాలు పెద్దలకు తలనొప్పిగా మారిపోయాయి కొంతమంది యువతీ , యువకులు తమను ప్రేమించిన వారు మోసం చేశారని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు మరికొంత మంది పెళ్లిచేసుకోమంటే పత్తా లేకుండా పారిపోతున్నారు .

తాజాగా ఇలాంటి సంఘటనే బెజ్జురు లో జరిగింది , బారెగూడా గ్రామానికి చెందిన చిప్ప రమేష్ మౌనికలు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా కూడా ఒక్కటయ్యారు అయితే ఎపుడు తనని పెళ్లి చేసుకుంటావ్ అని మౌనిక అడిగిన ప్రతి సారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు రమేష్.

గత 15 రోజుల క్రితం ప్రియుడు తో గొడవ పడి గ్రామ పెద్దలముందు తనను పెళ్లి చేసుకోవాలని పంచాయతీ పెట్టింది మౌనిక , అందరి ముందు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన రమేష్ తన తల్లి మాటలు విని ఎటో వెళ్లి పోయాడు విషయం తెలుసుకున్న మౌనిక రమేష్ ఇంటి ముందు రెండు రోజులుగా మౌన పోరాటం చేస్తుంది .

రమేష్ వచ్చి తనను ఇల్లి చేసుకునే వరకు తానూ ఈ పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె తెలియంది ఈ క్రమంలో కొంతమంది గ్రామస్తులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఈ విషయం పై స్థానిక పోలీసులకు ఎటువంటి పిర్యాదు అందలేదు , లిఖిత పూర్వకంగా ఇర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీస్ లు తెలిపారు

Leave A Comment