ప్రజా సమక్షంలో ప్రజానాయకుడి ప్రమాణ స్వీకారం

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజారిటీ తో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే రాష్ట్రం మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు ఒక ప్రాంతీయ పార్టీకి 51% శాతానికి పైగా ఓట్లు వేసి గెలిపించడం నిజంగా ఒక అద్భుతం .
ఇక పోతే ఈ రోజు ప్రజల సమక్షంలో విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో లో 12: 23 నిమిషాలకు జగన్ మోహన్ రెడ్డి గారి చేత గవర్నర్ నరసింహన్ గారు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించారు..


ప్రమాణ స్వీకారం లో జగన్ ఎటువంటి పక్షపాతం గాని , రగద్వేషాలు గాని లేకుండా దేవుని దయతో ప్రజల ఆశిశులతో మంచి పాలనను అందిస్తానని చెప్పారు
ఇంకా ఆయన మాట్లాడుతూ తన 10 ఏళ్ల రాజకీయ జీవితం లో ఎన్నో ఆటు పోట్లను చూశానని తాను ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యానంటే దానికి కారణం కేవలం కార్యకర్త ల అభిమానుల, ప్రజల ఆదరాభిమానాలే కారణమని తెలిపారు తన కోసం ఇంత కష్టపడ్డ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు

Leave A Comment