జగన్ నిర్ణయానికి షాక్ అవుతున్న నేతలు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే ఇకపోతే ఆ పార్టీకి ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చి అధికారం లో కూర్చోబెట్టారు.
ఈ నెల 30 వ తారీకున విజయవాడలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప గా మార్చారని రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ గా ఉందని వీలైనంత వరకు హంగులకు ఆర్భాటాలు పోకుండా ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమమైనా వీలైనంత తక్కువ ఖర్చు లో చేయాలని ఇప్పటికే అధికారులకు సూచించారట .
ఇందులో భాగం గానే ఈ నెల్ 30 వ తారీకున జరగనున్న ప్రమాణ స్వీకారానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎల్.వి సుబ్రహ్మణ్యం గారిని కోరారట అయితే ఆయన ఈ కార్యక్రమానికి సుమారు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారట.

Cs l.v subramanyam
అయితే ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం లో అంత ఖర్చు పెట్టి హంగామా చేయాల్సిన అవసరం లేదని కేవలం 2 నుంచి 3 లక్షల లోపే ఖర్చు అయ్యేలా చూడాలని కోరారట , దానికోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో ప్రమాణ స్వీకారానికి ఎంచుకున్నారట , ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రభుత్వ అధికారుల కోసం ఎలాగూ ప్రభుత్వం భవనాలు ఉండనే ఉన్నాయి, నాయకులు కార్యకర్తల కోసం ఆయా ప్రాంతాల్లోని నాయకులు వసతులు ఏర్పాటు చేయాలని కోరారట , అంతే కాకుండా స్టేడియం లో అన్ని వసతులు ఉండనే ఉన్నాయి.
అందువల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పారట .. ఆయన తీసుకున్న నిర్ణయానికి సీఎస్ తో సహా తోటి నాయకులు, అధికారులు కూడా ఆశ్చర్యపోయారు
గతం లో ఉన్న ప్రభుత్వాలు ప్రమాణ స్వీకారానికి లక్షలు ఖర్చు పెట్టారని కానీ ఈయన మాత్రం అందుకు పూర్తి విరుద్ధం గా తక్కువ ఖర్చులో అయిపోయేలా ఉండేలా చేయడం తో రాష్ట్రానికి సరైన నాయకుడు వచ్చాడని అందరూ అనుకుంటున్నారు..

Leave A Comment