ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇపుడు అందరు జగన్ ని గెలిచిన నాయకుడి గా చూస్తున్నారు . కానీ ఈ గెలుపు అంత సులువుగా మాత్రం దక్కలేదు .
దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం లో ఎన్నో మార్పులు జరిగాయి కాంగ్రెస్ అధిష్టానం సైతం వైయస్ చేసిన మేలును మరచి స్వార్థం గా మారిపోయింది ..
జగన్ ప్రస్థానం :
తన తండ్రి మరణం తర్వాత ఆ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఎందరో అభిమానులకు ఓదార్పు నిచ్చేందుకు తన వంతు గా ఆ కుటుంబాలను కలిసి వారిని ఓదారుస్తానని జగన్ నాటి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినా దానికి వారు ఒప్పుకోలేదు కారణం జగన్ ఎక్కడ తమకు ఏకు మేకులా తయారు అవుతాడో అని అయినా కానీ జగన్ దైర్యం గా కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఓదార్పు యాత్రను చేశారు ఆ సందర్భం గా ఏర్పాటు చేసిందే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాడు ఇంకొంత మంది వైస్సార్ పై అభిమానమున్న నాయకులూ తాము కూడా జగన్ గారి వెంటే నడుస్తామని చెప్పి వారి పదవులకు రాజీనామా చేసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 16ఎమ్మెల్యే స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయ దుంధుబి మోగించారు ..

సరిగ్గా అప్పుడే కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను ఎలాగైనా నిలువరించాలని అతని పై ఆ సమయం లో రాష్ట్రము లో అధికారం లో ఉండాగానే కొంతమంది జగన్ వ్యతిరేకులతో కలిసి అతని పై అన్యాయ పూరిత కేసులను బనాయించి తమకున్న అధికార బలం తో జైలు లో పెట్టించారు , అప్పుడైనా జగన్ తమ దారిలోకి వస్తాడని వారంతా ఊహించారు .

కానీ మొండి పట్టుదల ఉన్న నాయకుడు జగన్ దైర్యంగా ఆ కేసులను ఎదుర్కొన్నాడే తప్ప ఎవరికి తల వంచలేదు .. జగన్ జైలు కి వెళ్లడం తో ఇక అందరు వైస్సార్సీపీ పార్టీ పని అయిపోయిందని భావించారు కానీ సరిగ్గా అపుడే నేను జగన్ వదిలిన బాణాన్ని అంటూ వైస్ షర్మిలా గారు రంగం లోకి దిగారు జగన్ గారి దిశా నిర్దేశంలో మహా నేత ఆశీషులతో , ప్రజల అభిమానం తో తమను నమ్మి తమ తో పాటు నడిచిన నాయకులకు , అభిమానులకు కొండంత అండగా నిలిచారు అందరిలో ధైర్యాన్ని ఇచ్చి పార్టీని సరైన మార్గంలో నడిపారన్న విషయం లో ఎటువంటి సందేహం లేదు , ఆ సమయం లో కొన్ని పచ్చమీడియాలు సైతం జగన్ లక్ష కోట్ల దొంగ అని ఊకదంపుడు ప్రచారాలు చేసి దెబ్బతీయాలని చూసినా వాటన్నిటిని ఎదుర్కొని దైర్యంగా ఉన్నాడు జగన్ .

ఆ తర్వాత 16 నెలలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యి బయటికి రావడం జరిగింది .. ఆ తర్వాత కొన్ని రోజులకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము అంటూ కెసిఆర్ దూసుకు పోవడం తో నాటి కాంగ్రెస్ చేసేదేమి లేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ఆ సమయం లో కూడా జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర అని మనమందరం విడిపోకుండా కలిసి మెలిసి ఉండాలని భావించారు కానీ అది జరగలేదు ..

ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తర్వాత మొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం మోగింది ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలకు మంచి పాలనను అందించాలని రాష్ట్రము మొత్తం పర్యటించి 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో తమ భ్యర్థులను పోటీలోకి దింపారు కానీ ఆ సమయం లో విజయం చంద్రబాబు నాయుడు గార్ని వరించింది దానికి కారణం , జగన్ లక్షకోట్ల దొంగ అని , అతనికి సరైన అనుభావం లేదని , జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు పెట్రేగిపోతాయని పచ్చమీడియా చేసిన దుష్ప్రచారం. అంతే కాకుండా చంద్రబాబూ గారు  అడ్డగోలు హామీలు ఇస్తుంటే జగన్ మాత్రం తానూ చేయలేని హామీలను ఇవ్వలేనని ఖరాకండిగా చెప్పడం కూడా ఒక కారణం అయితే ఈ ఎన్నికల్లో జగన్ గారి పార్టీ 67 అసెంబ్లీ స్థానాల్లో ,8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచినప్పటికీ ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష హోదాను స్వీకరించారు .
నాటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా గొంతుకను వినిపించడంలో సఫలమయ్యారు , కానీ అధికారం లో పార్టీ జగన్ ధాటికి తట్టుకోలేక కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షం గా వ్యవహరించారు అయినా కూడా జగన్ ఎక్కడ సంయమనం కోల్పోకుండా కేవలం ప్రజా సమస్యలపై పోరాడారు
కానీ ఈ సమయం లోనే నాటి అధికార పార్టీ వైసీపీ పార్టీ నుండి గెలిచినా 23 మంది ఏఎమ్మెల్యే లను అప్రజాస్వామిక రీతి లో తమ పార్టీలోకి తీసుకున్నారు ఇది తప్పు అని ఎవరు చెప్పినా వినకుండా నాటి అధికార పార్టీ తమ అధికార బలాన్ని చూపించింది .
అయితే ప్రత్యేక హోదా సాధించి తీరతా అని చెప్పిన చంద్రబాబు గారు దానిపై ఏ విధమైన కార్యాచరణను చేయకపోవడం హోదా ఇవ్వము ప్రత్యేక ప్యాకేజీ ని ఇస్తాం అంటే దానికి ఒప్పుకుని హోదా అంశాన్ని తుంగలో తొక్కడం జరిగింది , నాటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం తో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లారు అదే సందర్భంలో తమ పార్టీ నుంచి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యే ల పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినా కూడా పట్టించుకోకపోవడం శోచనీయం .
ఇక పొతే ఆ తర్వాత జగన్ ఒక పక్క ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే మరో పక్క తమ భిమానులపై కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని మీ అందరికి నేనున్నా అని ఒక భరోసాను కల్పించారు .
ఒక పక్క నాటి అధికార పార్టీ దాడులను తట్టుకుంటూ మరోపక్క ప్రజా సమస్యలపైనా , ప్రత్యేక హోదా పైన పోరాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు ..
ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఓక సంచలనం నిర్ణయం తీసుకున్నారు అదే అసెంబ్లీ ని భహిష్కరించడం దానికి కారణం తమ పార్టీ గుర్తు పై గెలిచిన అభ్యర్థులను సంతలో పశువులను కొన్నట్టు కొనడమే కాకుండా వారిలో కొంత మందికి మంత్రి పదవులిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని దాని పై విచారణ చేసి వారందని ఆయా పదవుల నుంచి తప్పించి మల్లి పోలింగ్ జరపాలని ఎంత అభ్యర్ధించినా పట్టించుకోకుండా ఉన్న నాటి స్పీకర్ ఏకపక్ష ధోరణి తో విసిగి పోయిన జగన్ ఎప్పుడైతే మీరు పార్టీ మారీన ఎమ్మెల్యే ల పై తగిన చర్యలు తీసుకుంటారో ఆనాడే మేము మల్లి అసెంబ్లీ లోకి అడుగుపెడతాం అని ఖరాఖండి గా చేప్పి అసెంబ్లీ నుంచి బయటికి వచ్చారు ..
దీనిని కూడా కొంతమంది పచ్చ పత్రికల వాళ్ళు , ఇంకొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కలిసి జగన్ పోరాడలేక అసెంబ్లీ నుంచి పారిపోయాడని ఎద్దేవా చేశారు అయినా కూడా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు జగన్ గారు .
ఆ తదనంతరం ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం వారితో కలిసి మమేకమయ్యి వారి సాధక భాధకాలను తెలుసుకోవడం కోసం తన తండ్రి చూపిన బాటలోనే పాదయాత్ర చేయాలనీ సంకల్పించి “ప్రజాసంకల్ప యాత్ర ” ను మొదలు పెట్టారు . “రావాలి జగన్ కావాలి జగన్ ” అనే నినాదం తో నవంబర్ 6 , 2017 వ తారీకున తన తండ్రి ఆశీషులతో పులివెందుల నుంచి రాష్ట్రము లోని అన్ని నియోజక వర్గాల్లో పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు నాటి నుంచి పాదయాత్ర అప్రతిహతం గా సాగింది ఈ యాత్ర లో జగన్ ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ , మరో పక్క ప్రత్యేక హోదా అంశం పై ద్రుష్టి సారించి అధికార పక్షానికి చెమటలు పట్టించాడు .
341 రోజుల , 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి చోట ప్రజలు తమ కష్టాలను జగన్ గారితో చెప్పడం వారందరికీ సరైన న్యాయం చేస్తానని వారికి భరోసా ఇవ్వడం జరిగింది . అంతే కాకుండా ప్రత్యేకహోదా అంటే జైలుకే అన్న అధికార పక్షం తో సైతం ప్రత్యేకహోదా కావాలి అనిపించేలా చేయడం జగన్ గారి మొదటి గెలుపు.
ఇక పొతే ఎన్నికల సమీపిస్తున్న వేళ జగన్ గారిని దెబ్బకొట్టాలని కొంతమంది ఆయన పై వైజాగ్ విమానాశ్రయం లో హత్యాయత్నానికి పాల్పడ్డారు కానీ దేవుడి దయ , ప్రజల అభిమానం వల్ల తృటిలో పెనుప్రమాదం నుంచి ఆయన బయట పడ్డారు అంతే కాకుండా నాటి అధికార పక్షవర్గం వాళ్ళు జగన్ కావాలనే తానే తన పై హత్యాయత్న ప్రయత్నం జరిపించుకున్నాడని తప్పుడు ఆరోపణలు చేశారు అయినా కూడా జగన్ ఓపిక తో అన్నిటిని ఓర్చుకున్నాడు , తన అభిమానులను కూడా ఎక్కడ సంయమనం కోల్పోకుండా ఉండాలని కోరడం తో అభిమానులు తమ నాయకుడి మాటకు కట్టుబడి ఉన్నారు ,
ఆ తర్వాత కొంతకాలానికి మరో సంఘటన వైస్ అభిమానులను కలచి వేసింది అదే వైయస్ వివేకానందరెడ్డి హత్య . ఎన్నికలు ఇంకొద్ది రోజుల సమీపంలో ఉందనగా జగన్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని ప్రత్యర్ధులు ఆయన బాబాయి వైయస్ వివేకానందరెడ్డి గారిని హత్యచేశారు . అయితే దీనినికూడా జగనే చేయించారని తద్వారా సానుభూతి ఓట్లు పొందాలని ఇలా చేశారని కొంతమంది చిల్లర వ్యాఖ్యలు చేశారు . అయితే అన్నిటిని దేవుడు చుస్తున్నాడని తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందని నమ్మాడు జగన్ .
ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చినా , జనసేన వ్యక్తిగతంగా వాఖ్యలు చేసినా వాటన్నికి తనదైన రీతి లో సమాధానాలు ఇస్తూ వచ్చారు జగన్ ..
ఎన్నికలు ముగిసాయి ఫలితాల రోజున ప్రతి అభిమానిలో ఒకటే ఉత్కంఠత అందరు అనుకున్నట్టుగానే జగన్ మోహన్ రెడ్డి గారు ఎవ్వరూ ఊహించనంతగా భారీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు , ఫ్యాన్ గాలి దెబ్బకు ఏ ఒక్కరు కూడా కనిపించకుండా కొట్టుకు పోయారు ..
ఫలితాల అనంతరం జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తమకు ఈ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు , గెలుపుకోసం అని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 వాతారీకున ప్రమాణ స్వీకారం చేస్తానని కేవలం 6నెలల నుంచి 12 నెలల లోపు తానొక మంచి పరిపాలనను అందించే నాయకుడిగా మీ అందరి గుండెల్లో నిలిచిపోతానని చెప్పారు ..

జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఒడిదొకులను తట్టుకుంటూ కష్టనష్టాలకోర్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు నిజంగా ఆయన రాజకీయ ప్రయాణం ప్రతి ఒక్క అభిమానికి సరైన కానుక , ఇకపోతే ఇప్పటికే అప్పుల కుంపటి గా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోతారో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో వేచి చూడాలి

Leave A Comment