అల్లరి మూకలకు హెచ్చరిక ! పోలీసులకు ప్రత్యేక అధికారాలు??

తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన జగన్ మోహన్ రెడ్డి గారు అప్పుడే తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు , ఫలితాల రోజున సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం లో తాను 6 నెలల నునుచి 12 నెలల లోపే మంచి ముఖ్యమంత్రి గా ప్రజల చేత అనిపించుకుంటానని రాష్ట్రంలో తన మార్కు పాలనను చూపిస్తానని చెప్పారు..
ఈ నెల 30 వ తారీకున ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ ఇప్పటినుంచే రాష్ట్ర పాలన పై దృష్టి సారించారు ఈ సందర్భంగా నిన్న కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారితో రాష్ట్రంలో శాంతి భద్రత లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు అన్నీకంటే ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా అల్లర్లు , గొడవలు జరుగుతాయో ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారించాలని దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

police-cap

ఇకపోతే తప్పుచేసే వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అందుకుగాను నిజాయితీ గల పోలీస్ అధికారులను నియమించాలని కోరారు దేశం మొత్తం మీద ఉన్నటువంటి నిజాయితీ గల పోలీస్ అధికారుల లిస్టును తనకు అందించాలని , అవసరమైతే డిప్యూటేషన్ పై కొంతమంది అధికారులను రాష్ట్రంలోకి తీసుకురావాలని దానికోసం తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు.

ఏది ఏమైనా రాష్ట్రంలో ఎక్కడా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలైనా తీసుకోవాలని వారికి సూచించాడు.
అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన మాత్రం వెలువడలేదు ఒక వేళ ఇదే గనక జరిగితే రాష్ట్రంలో చాలా చోట్ల కొంతమంది నాయకులకు, అభిమానులకు ఊపిరి ఆడకుండా చేసినట్టే, ముఖ్యంగా గొడవలు అల్లర్లు చేసే వారికి ఇక గడ్డుకాలమనే చెప్పాలి

One Comment

  1. drcpreddy@gmail.com-Reply
    May 26, 2019 at 3:08 pm

    Thanks and that is great Jagan the ruler

Leave A Comment