నన్ను ఓడించేందుకు 150 కోట్లు ఖర్చు పెట్టారు : పవన్ కళ్యాణ్

జరిగిన ఎన్నికల్లో కేవలం నన్ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకుండా చేసేందుకు భీమవరంలో 150 కోట్లు ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు.
నిన్న విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జనసేన ఓటమికి గల కారణాలను ఆయన నాయకుల తో ఇంకా కార్యకర్తల తో చర్చించినారు.
ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సమావేశానికి వచ్చిన కార్యకర్తలందరిని అందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చారని అడిగి తెలుసుకున్నారు పార్టీ ఓడిపోయినా మీరందరు పార్టీ వెంట నిలబడడమే మనకు పెద్ద విజయం అని ఆయన వారితో అన్నారు.
అంతే కాకుండా ఎన్నికల్లో ఈవీఎంలు సరిగా పని చేయకపోవడం ఇతర పార్టీ నాయకులు డబ్బు మద్యం తో ఓటర్ల ను మభ్యపెట్టారని ఇవన్నీ జనసేన ఓటమికి కారణమని ఆయన అన్నారు, తాను ఓటమికి కృంగి పోయే రకం కాదని ఎన్ని ఓటములు వచ్చినా ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం తోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ జనసేన జెండా కనపడాలని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని చెప్పారు.
కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏవిధంగా పరిపాలన చేస్తుందో వేచిచూడాలి అని ఆయన అన్నారు

Leave A Comment