బై బై బాబు అంటున్న తెలుగు తమ్ముళ్లు

బై బై బాబు అనే నినాదం తో గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ వారు తెగ హడావుడి చేశారు రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం తో ఆటు బై బై బాబు అనే నినాదాన్ని కూడా జనాల్లోకి బాగానే తీసుకెళ్లారు అయితే ఇప్పుడు ఇదే నినాదాన్ని తెలుగు తమ్ముళ్లు కూడా ఫాలో అవుతున్నట్లున్నారు .

ఇంతకీ విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో టిడిపి పార్టీ చిత్తుగా ఓడిపోవటం తో ఏమి చేయాలో ఆ పార్టీ తమ్ముళ్లకు అర్ధం కావట్లేదట పదవిలేని వాళ్ళని పనోళ్ళు కూడా సరిగా పట్టించుకోరని సామెత గుర్తు చేసుకుంటూ ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్లిపోదామా అని ఆలోచిస్తున్నారట కొంతమంది నాయకులు .

ఇప్పటికే నాలుగు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరున్నట్టు వార్తలు రావడం ఈ రోజు కాకినాడలో తోట త్రిమూర్తులు నేతృత్వంలో 15 మంది ప్రముఖులు రహస్యంగా సమావేశం ఏర్పాటు చేయడం చూస్తుంటే త్వరలోనే టిడిపి పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి భారీగా వలసలు ఉండే అవకాశం కనిపిస్తుంది .
ఐతే చంద్రబాబు గారు ప్రస్తుతం కుటుంభం తో కలిసి ఫారెన్ కు వెళ్లిన విషయం తెలిసిందే మరి ఆయన తిరిగొచ్చే లోపు ఆర్టీలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో చూడాలి మరి

Leave A Comment