లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ లో ఆత్మ కమిటీ చైర్మన్ గా శ్రీ బత్తుల వీరయ్య గారు మరియు డైరెక్టర్ల ప్రమాణ శ్రీకారానికి హాజరై న గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ రైతే దేశానికి రాజు, నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, రైతు కష్టాలు అంటే ఏంటి నాకు తెలుసు, కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎంతో అద్భుతమైన పథకం అని, దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పథకం లేదని, వనమా కుటుంబాన్ని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదు అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీ కొత్వాల శ్రీనివాస రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ శ్రీ మండే వీర హనుమంత్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ కాపు సీత లక్ష్మి, ఎంపీపీ లు బాధావత్ శాంతి, భూఖ్య విజయలక్ష్మి, జెడ్పీటీసీ లు బిందు చౌహన్, బరపటి వాసు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, డైరెక్టర్లు టిఆర్ఎస్ నాయకులు వుకాంటి గోపాల్ రావు, MA. రజాక్, కాసుల వెంకట్, తూము చౌదరి, ఆళ్ల మురళి, కొట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, బాగం మహేశ్వర రావు, మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతు లు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.