*భద్రాద్రి కొత్తగూడెం :- పినపాక, 13 డిసెంబర్ (amazonnews)*
*వలస ఆదివాసి బాలుడికి జనం కోసం మనం ఆర్థిక సాయం*

మండలంలోని వలస ఆదివాసీ గ్రామమైన టేకులగూడెం గ్రామానికి చెందిన దీర్ఘ సోమయ్య అనే 12 సంవత్సరాల బాలుడు, ఇటీవల పాము కాటుకు గురై, ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాపాయ స్థితిలో కి వెళ్ళాడు. ప్రభుత్వ విప్పు రేగా కాంతారావు చొరవతో బాలుని భద్రాచలం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు బాలుని కాలు తొలగించి ప్రాణాలు కాపాడారు. సోమయ్య ది రెక్కాడితే గాని నొక్కాడని నిరుపేద కుటుంబం. ఆర్థిక పరిస్థితి తో పాటు, నిత్యం మందుల ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో, సోమయ్య తండ్రి జోగయ్య ఆపన్న హస్తం అందించాలని దాతలను వేడుకొన్నాడు. మణుగూరు కు చెందిన జనం కోసం మనం అనే సంస్థ, మానవతా హృదయం తో ముందుకు వచ్చి, అడవిలో ఉన్న టేకులగూడెం గ్రామానికి వెళ్లి, సోమయ్య కుటుంబానికి రూ 7700 నగదు, 70 కేజీల బియ్యం, పండ్లు అందజేశారు. అలాగే గ్రామస్తులకు దుస్తులు, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్ లు అందజేశారు. ఈ బయ్యారం గ్రామానికి చెందిన మైత్రి సుబ్బారెడ్డి తన కూతురు సుధ జ్ఞాపకార్థం రూ 1000 నగదును, 15 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లో జగన్ కోసం మనం సంస్థ సభ్యులు గూడూరు కృష్ణా రెడ్డి, పూనాటి పాపయ్య, వడ్డే ప్రవీణ్, అన్ననేని ప్రసాద్, గుంటక శ్రీనివాస్ రెడ్డి , పినపాక ఎంపీటీసీ చింత పంటి సత్యం లు పాల్గొన్నారు.