గోదావరిలో లాంచీ మునక 47 మంది?? గల్లంతు
విహారాయత్ర లో పాలగిని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వారు అనుకున్నారు కానీ తామోకటి తెలిస్తే దైవమోకటి తలచిందన్న రీతిలో పాపికొండలు యాత్రకు వెళ్లిన యాత్రికులు గోదావరి వరద నీటిలో చిక్కుకుని గల్లంతయ్యారు .
దేవిపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు యాత్రకు బయలుదేరిన ప్రయాణికులు మంటూరు కుచ్చులూరు మధ్యలో నదీ వరద ప్రవాహానికి బోల్తా కొట్టింది.

అయితే ఈ ఘటన నుంచి లైఫ్ జాకెట్ లు ధరించిన 17 మంది సురక్షితంగా బయటపడ్డారు అయితే మిగిలిన 47 మంది లైఫ్ జాకెట్లు లేకపోవడం తో వారంతా నదిలో గల్లంతయ్యారు దీని పై స్పందించిన సీఎం జగన్ మోహన్రెడ్డి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు గల్లంతైన ప్రయాణీకులను వెతకడం కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను కూడా ఏర్పాటు చేశారు .


దీనిపై స్పందించిన మంత్రి కన్నబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పిల్లి శుభాష్ గారు త్వరితగతిన గల్లంతైన వారిని వెతకడానికి కావాల్సిన అన్ని చర్యలను చేపట్టమబి అధికారులకు ఆదేశించారు అయితే గోదావరిలో వరద ఉధృతి తగ్గక ముందే ప్రయాణికులను ఎలా అనుమతించారో తెలుసుకుని వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు