నిన్న తూర్పుగోదావరి జిల్లా కచ్ఛలూరు వద్ద గోదావరి నదిలో బోటు బోల్తా పడి అందులోని ప్రయాణికులు గల్లంతైన విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పటివరకు గల్లంతైన వారి ఆచూకీ పూర్తిగా కనిపెట్టలేకపోయారు మొదటగా ప్రమాదం నుంచి తప్పించుకున్న 17 మంది తెలిపిన వివరాల ప్రకారం బోటులో సుమారు 60 మంది ఉన్నట్టు అయితే కేవలం కొందరు మాత్రమే లైఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డామని మిగిలిన వారందరు నదిలో చిక్కుకు పోయారు.
అయితే ఇప్పటికే గల్లంతైన వారిలో 12 మంది మృత్యువాత పడ్డారు చనిపోయినవారి బాడీలను రాజమండ్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మిగిలిన వారికోసం తీవ్ర గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
దీనిపై స్పందించిన సీఎం జగన్ గారు ప్రమాద ఘటన కు కారణమైన బోటు యాజమాన్యం పై చర్యలు తీసుకోనున్నారు ఇకపై ప్రభుత్వ అనుమతి లేని బోట్లను నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు .
నేడు సీఎం ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారట