కామారెడ్డి న్యూస్:-

కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం లో కోటిన్నర రూపాయలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రారంభించి, 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మించనున్న అదనపు తరగతి గదుల కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ శరత్, ఇతర స్థానిక నేతలు.

సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి కామెంట్స్….

కోవిడ్ వచ్చి విద్యాలయాలు, హాస్టళ్లు మూసివేసి మా విద్యార్థులంతా చాలా ఇబ్బంది పడ్డారు.

త్వరలో కరోనా పోయి పాఠశాలలు ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసిఆర్ గారు సీఎం అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో గిరిజనుల గౌరవం పెరిగింది.

గతంలో గిరిజనులను మిగిలిన రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ గానే చూశాయి.

కానీ సీఎం కేసిఆర్ గారు తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనులు స్వయం పాలన చేసుకునే గొప్ప గౌరవం కల్పించారు.

నేను చదువుకునేటప్పుడు ఇలాంటి కేసిఆర్ లు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది.

అప్పట్లో మా దగ్గర స్కూల్ లేకపోయేది…హాస్టల్ ఉంటే అక్కడ ముక్కిపోయిన అన్నం తినలేక పారిపోయే వారం. అందుకే చదువు మధ్యలో ఆగితే, తొందరగా పెళ్లి చేసేవారు.

కానీ నేడు సీఎం కేసిఆర్ గారు గిరిజనులు బాగు పడాలంటే విద్య అత్యంత ముఖ్యం అని భావించి, దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు మన రాష్ట్రంలో ప్రారంభించారు.

గురుకులం పెట్టడమే కాకుండా నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలున్న భోజనం పెడుతున్నారు.

కోవిడ్ మొదలు కాగానే హాస్టల్ లో ఉన్న నిత్యావసర సరుకులు మా పేద బిడ్డలకు పంపిణీ చేశాం.

ఇంటి దగ్గర ఉన్న మా విద్యార్థులు వివిధ ప్రమాదాలకు గురి అవుతున్నారని తెలిసినప్పుడు మనసు కలచి వేస్తుంది. ఈ మహమ్మారి కరోనా ఎపుడు పోతుందో అని ఎదురు చూస్తున్నాం.

ఇంటర్ తరవాత గిరిజన ఆడ బిడ్డలు విద్య మానేస్తున్నారు అంటే వెంటనే గిరిజన బిడ్డలు డిగ్రీ చదువుకునేందుకు 22 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్ గారు.

గిరిజనుల ఆరాధ్య దైవం సేవా లాల్ గుడి ప్రారంభోత్సవం లో నేడు పాల్గొనడం సంతోషం.

గిరిజనులు అంటే కష్టపడే వారు, నీతి నిజాయితీ కలిగి ఉంటారన్న పేరు నిలబెట్టుకోవాలి. సేవాలాల్ మహరాజ్ చెప్పినట్లు మద్యపానానికి, మాంసహారానికి దూరంగా ఉండాలి.

ఎన్టీఆర్ గారు ఒక యుగ పురుషుడు. కాబట్టి జనరల్ సీటులో ఒక గిరిజన మహిళగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

అదే విధంగా మరో యుగ పురుషుడు సీఎం కేసిఆర్ గారు…నాకు అనేక అవకాశాలు ఇచ్చారు. ఆయన కేబినెట్ లో తొలి మహిళా మంత్రిగా అవకాశం కల్పించారు.

ఒకప్పుడు మహిళలు మంచి నీటి కోసం మైళ్ళు నడిచేవారు…కానీ సీఎం కేసిఆర్ గారి మిషన్ భగీరథ ద్వారా నేడు ఇంటింటికి నీరు రావడంతో మహిళల నీటి కష్టాలు తీరాయి.

గిరిజన సంక్షేమం ద్వారా వచ్చే అన్ని నిధులు ఈ నియోజక వర్గానికి ఇవ్వడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను.

పంచాయితీలుగా మారిన తండాల్లో కావాల్సిన వసతులు కూడా అందించేందుకు నేను కృషి చేస్తాను.

సమావేశంలో ఎమ్మెల్యే జాజాలా సురేందర్ గారి కామెంట్స్….

ఈరోజు నియోజకవర్గానికి వచ్చి kgbv ని ప్రారంభించి, 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే అదనపు గదులను ప్రారంభించిన మంత్రి సత్యవతి గారికి ధన్యవాదాలు.

నేటి ఇక్కడి పిల్లలకు ఈ వేదిక మీద ఉన్న కలెక్టర్ శరత్, మంత్రి సత్యవతి రాథోడ్ లే ఆదర్శం.

ఇలా ఎదగాలంటే ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను చదువుకునేందుకు ప్రోత్సాహం ఇవ్వాలి.

మహిళా డిగ్రీ కాలేజీ ఇక్కడ అత్యంత అవసరం ఉన్నందున మంజూరు చేయాలని కోరుతున్నాను.

ప్రతి తండాకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

సమావేశంలో గిరిజన గురుకులంలో చదివి ఏం.బి.బి.ఎస్ సీటు సాధించిన స్వర్ణను సన్మానించి, ఆమె తల్లిదండ్రులను మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అభినందించారు.

ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి చెక్స్ అందించారు.