భద్రాద్రి కొత్తగూడెం,పినపాక (Amazon news)

ఇటీవలే కే. రమణయ్య అను వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి డ్వాక్రా మహిళ సంఘాలకు తెల్ల రేషన్ కార్డ్ ద్వారా 22500 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకు వెయ్యమని ముఖ్య మంత్రి కెసిఆర్ గారు చెప్పారు అని మాటల్లో దించాడు. కే. రమణయ్య భార్య డ్వాక్రా సంఘాల లో ఉండటం వల్ల నిజమే అనుకున్నాడు.ఆ వ్యక్తి మాట్లాడుతూ ఈ 22500 మీ అకౌంట్ లోకి రావాలి అంటే మినిమం బ్యాలన్స్ 2500-3000 ఉండాలి అని చెప్పాడు.కానీ రమణయ్య అకౌంట్ లో 1000 ఉండడంతో పకనే ఉన్న వ్యక్తి ఫోన్ పే నంబర్ చెప్పాడు.ఆ వ్యక్తి అదో ఎదో చెప్పి తన బ్యాంక్ అకౌంట్ లింక్ పంపి 10000 వారి చేతనే కోటించుకున్నడు.అప్పుడు ఏం చేయాలో తెలియని రమణయ్య పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక మండలం లో ఏడుల్ల బయ్యారం లో చోటుచేసుకుంది.