👉 నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గారు గెలుపొందడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారు హర్షం వ్యక్తం చేశారు.

👉 ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారి కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

👉 ఎన్నికతో మండలిలో మహిళల సమస్యల పరిష్కారానికి మరో గళం తోడుకానున్నదన్నారు. ఈ రోజు శుభదినమన్నారు.

👉 ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి చిరునామాగా, బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి రాష్ట్రంలోని మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చారని, తెలంగాణ జాగృతి సంస్థతో సాంస్కృతిక వారధిగా నిలిచారని కొనియాడారు.

👉 ఎమ్మెల్సీగా ఎన్నికకావడం వల్ల మహిళల సమస్యలు పరిష్కారం అవుతాయని, మరెంతో మందికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

👉 తెలంగాణలో ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి కవిత రుజువు చేశారన్నారు.

👉 త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే విజయం పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు.

👉సీఎం కేసీఆర్‌ గారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.