జీవన విధానం ద్వారా మనం మన శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగు పరచుకోవచ్చు.సూర్యోదయానికి ముందు
లేవడం అలవాటు చేసుకోవాలి.ఉదయిస్తున్న సూర్యున్ని చూడటం ద్వారా చైతన్యాన్ని పొందవచ్చు.ఒక పది
నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తర్వాత మీ పనులు ప్రారంబించుకోండి.ఇలా చేయడం ద్వారా మీరు మీ పనిని
రెట్టింపు ఉత్సాహంతో చేయగలరు. మన మానసిక ఆరోగ్యానికి ప్రశాంతత చాలా అవసరం.

ఆరోగ్యం ఉంటేనే కుటుంబం లో సంతోషం ఉంటుంది కనుక వీలైన ప్రతి ఒక్కరూ చేసి ఒత్తిడిని జయించండి.
మహిళలు అమ్మొ అంత పని పెట్టుకొని పది నిమిషాలు కూర్చోవడమ అని హైరానా పడకండి.
ఇది మీకు అలవాటు గా మారే వరకు చిరాగ్గానే అనిపిస్తుంది కానీ తరువాత మీకు ఈ సమయం మనస్సుకు
సంతోషాన్ని కలిగించే సమయంగా మారుతుంది.ఎలాఅంటారా? ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు చేసే పనులు
తీసుకునే నిర్ణయాలు ఖచ్చితత్వం కలిగి ఉంటాయి.

ఎవరు ఎక్కువ ఒత్తిడి జీవితం గడుపుతున్న ఇలా సూర్యోదయానికి పూర్వమే లేచి కా‌సేపు ప్రశాంతంగా ఏ
ఆలోచనా లేకుండా సూర్యోదయాన్ని చూస్తూ గడపండి.ఇలా రోజూ చేస్తుంటే కొన్ని రోజులకు మీ ఒత్తిడిని మీరు
జయించగలరు.