పినపాక మండలం లోని దుగినేపల్లి లో డబుల్ బెడ్ రూమ్ శంకుస్థాపన కు విచ్చేసిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావును దుగినేపల్లి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కలిసి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా:బాబాసాహెబ్ అంబేద్కర్ భవనానికి దుగినేపల్లి లో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 100/1 లో అంబేద్కర్ భవనఏర్పాటుకు స్థలం కేటాయించాలని, తద్వారా ఆ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మించాలని దుగినేపల్లి యూత్ అందరూ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసి వినతిపత్రం అందజేయటం జరిగింది, దానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు సానుకూలంగా స్పందించి తప్పకుండ దుగినేపల్లిలో అంబేద్కర్ భవనానికి స్థలంకేటాయించి అందులో అంబేద్కర్ భవనాన్నినిర్మించటానికి తప్పక ప్రయత్నిస్తానని తెలియజేసారు.ఈ సందర్బంగా ఈ కార్యక్రమం లో పాల్గొన్న అంబేద్కర్ యూత్ సభ్యులు భూతం సూర్య నారాయణ, తిరుమలరావు, పోచయ్య, చందర్ రావు, సంపత్ కుమార్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, తదితరులు ఎమ్మెల్యే రేగ కాంతరావుకు కృతజ్ఞతలు తెలియజేసారు, దీనికియూత్ తో పాటు గ్రామ ప్రజలుకూడా తమ మద్దతుతెలియజేసారు.