విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తన మార్క్ చూపిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కీలక అడుగు వేసారు.

వరంగల్ సెంట్రల్ జైలు తరలింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.

దాని స్థానంలో ఎంజీఎం తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవలే వరంగల్ సెంట్రల్ జైలు, ఎంజీఎం పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేసారు.

వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు, సిబ్బందిని ఇతర జైళ్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అక్కడ ఉన్న ఖైదీలను చర్లపల్లి, నిజామాబాద్, ఖమ్మం జైళ్లకు తరలించాలని జైళ్లశాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖైదీలను ఇతర ప్రాంతాలకు తరలింపుపై విమర్శలు కూడా వస్తున్నాయి.