Rx 100 ఫేమ్ కార్తికేయ హీరోగా , నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల సారధ్యంలో శ్రీమతి ప్రవీన కడియాల సమర్పణలో వస్తున్న చిత్రం గుణ369 ఈ రోజు చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ తెలుగులో సరైన కథలు రావట్లేదని అందరూ అంటున్నారు మా గుణ 369 చూసిన తర్వాత ఇకపై ఎవ్వరు అలాంటి మాటలు అనరు అంత జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం.

ఈ చిత్రాన్ని ఆగస్టు 2 వ తారీకున విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది ,నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం లో ప్రతి ఒక్కరికి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి అటు యువతకు, ఇటు కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ సినిమాను తీయడం జరిగింది ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి అయింది ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన రావడం చాలా సంతోషం గా ఉంది త్వరలోనే సినిమా పాటలను విడుదల చేస్తాం, ఆగస్టు 2 న సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నాం అని తెలిపారు