మెగాస్టార్ చిరంజీవి తన సొంత బ్యానర్ లో కొణిదెల ప్రొడక్షన్ , మాట్నీ ఎంట్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ఆచార్య , ఈ సినిమాలో చిరుకి జోడీగా అందాల బొమ్మ కాజల్ నటిస్తుంది సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ షూటింగ్ నీ శరవేగంగా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంది ఈ సమయంలో ఈ సినిమా చిత్ర బృందానికి అనుకోని సమస్య వచ్చి పడింది

మరోపక్క బాహుబలి రానా వేణు ఊడుగుల దర్శకత్వం లో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం విరాట పర్వం ఈ చిత్రం కూడా దాదాపు అన్ని పనులు ముగించుకుని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు విడుదల అవుతాయో లేదో అనే అనుమానం కలుగుతుంది దానికి కారణం “నక్సలిజం” అదేంటి అనుకుంటున్నారా
ఈ రెండు సినిమాలు నక్సల్ బ్యాక్ డ్రాప్ లో ఉండటమే కారణం
యాంటీ టెర్రరిజం ఫోరం సెన్సార్ వారికి ఈ రెండు చిత్రాలకు సెన్సార్ రిపోర్ట్ ను ఇవ్వకూడదని సెన్సార్ బోర్డ్ వారికి విజ్ఞప్తి చేశారట సెన్సార్ బోర్డ్ వారి అనుమతి లేనిదే ఏ చిత్రం కూడా థియేటర్ లలో విడుదల అవ్వదు అయితే సెన్సార్ వారు ఇప్పటి వరకు ఏటువంటి నిర్ణయం తీసుకోలేదు
మరో వైపు ఈ రెండు చిత్ర బృందాలు కూడా కాస్త గందరగోళం లో ఉన్నట్టు సమాచారం
ఎలాగైనా సరే ప్రభుత్వ సహకారం తో వారికి ప్రత్యేకంగా సినిమా చూపించి సినిమాలొ ఏటువంటి తప్పుడు సన్నివేశాలు లేవు అని నిర్ధారించిన తర్వాతే సెన్సార్ రిపోర్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారని కూడా వినికిడి

చూద్దాం ఏం అవుతుందో