బాలయ్య బాబు సినిమా తెరపైకి వస్తుంది అంటే నందమూరి అభిమానులకు పూనకాలే అది కూడా బాలకృష్ణకు లెజెండ్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో అయితే ఇక చెప్పక్కర్లేదు
దాదాపు రెండు సంవ్సరాల తర్వాత బాలకష్ణ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అయితే చాలా రోజుల నుంచి ఈ మాట వినిపిస్తున్నా సినిమా కు సంబందించిన విషయాలు పెద్దగా ఎవ్వరికీ తెలియలేదు అయితే ఈ రోజు తెలుగు నూతన సంత్సరం సందర్భంగా బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న BB3 సినిమా టైటిల్ రోర్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం

ఇక ఇందులో బాలకృష్ణ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి శివుని వీర భక్తుని గెటప్ లో కనిపిస్తూ “హర హర మహా దేవ్ ” కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలు కుస్తే కపాలం పగిలిపోద్ది అనే డైలాగ్ తోటి తన ఫ్యాన్స్ కి మరో సారి ఊర మాస్ సినిమాతో వస్తున్నా అని చెప్పకనే చెప్పినట్టు ఉంది
ఇకపోతే త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి భారీ ఎత్తున రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తుంది

చివరగా : కిందా మీదా ఊపు బాలయ్య బాబు తోపు నీకు దమ్ముంటే ఆపు

బాలయ్య బాబు కొత్త సినిమా టీజర్ పై మీరు ఓ లుక్కేయండి