ఈ మధ్యకాలం లో వచ్చిన జాతి రత్నాలు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే కరోనా వల్ల థియేటర్ లో సినిమా లు మిస్ అయిన ప్రేక్షకుల కు లాక్ డౌన్ తర్వాత డైరెక్ట్ థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలలో జాతి రత్నాలు కూడా ఒకటి

అయితే నిన్న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది థియేటర్ లో ఈ సినిమా చూడని వారు ఆదివారం పూట చక్కగా కుటుంబంతో కలిసి చూసే అవకాశం కలిగింది
ఇకపోతే ఈ సినిమాలో నటించిన నవీన్ పోలిశెట్టి , రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి లు తమ నటన తో ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నం సఫలమైందని చెప్పాలి కాకపోతే సినిమాలో కామెడీ ఉండాలి కానీ కామెడీ ఏ సినిమా కాకూడదు అనే విషయం డైరెక్టర్ అనుదీప్ మర్చిపోయాడో లేక కావాలని ఇలా తీసాడో అతనికే తెలియాలి

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో తన నటనకు దారులు వేసుకున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా కామెడీ ని నమ్ముకుని ఈ పాత్రని ఒప్పుకున్నట్లు ఉన్నాడు ఇకపోతే రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి లకు నవ్వించడానికి తప్ప నటించడానికి పెద్దగా స్కోప్ లేదు

చాలా వరకు సన్నివేశాలు జబర్దస్త్ లో చూసినవి లా అనిపించాయి అంతే కాదు అక్కడక్కడా పేరడీ తో కూడా నవ్వించడానికి ప్రయత్నించాడు డైరెక్టర్ ఆ విషయంలో సఫలమయ్యాడు కూడా
సినిమా పరంగా చూస్తే మొదటిభాగం లో నవ్వుల పూఇస్తూ ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా సినిమాని అలా అలా ముందుకు తీసుకెళ్లడం లో డైరెక్టర్ అనుకున్న విధంగా సఫలం అయినట్టు కనిపించాడు ఇక రెండో భాగానికి వచ్చేసరికి అక్కడక్కడా ప్రేక్షకుడికి కాస్త అసహనం కలిగిందనేది వాస్తవం బహుశా సినిమాలో కథ అనే పాయింట్ లేకపోవడం వల్ల ఏదో విధంగా సినిమా ని నడిపించాలి అనే ఉద్దేశం తో అనవసరపు పేరడీ కామెడీ వల్ల కూడా అలా అనిపించింది

ముఖ్యంగా ఆ కోర్టు సీన్ లో అయితే ఇదేందిరా అయ్య ఇలా కూడా ఉంటుందా కోర్టు లో అనే అనుమానం కూడా వస్తుంది ఇక్కడ సన్నివేశాలు మరీ యెబ్బెట్టుగా అనిపిస్తాయి కాకపోతే ఈ సినిమా కేవలం నవ్వుకొడానికి మాత్రమే తీశారు కాబట్టి ప్రేక్షకుడు ఎక్కడా లాజిక్ లు వెతక్కుడదు ఒక వేళ అలా వెతికితే మాత్రం భంగపాటు తప్పదు
గతంలో కేవలం కామెడీ నీ నమ్ముకుని ముందుకు వెళ్ళిన అల్లరి నరేష్ కూడా కొన్ని రోజులకు జనాలకు మోహమొత్తేశాడు అలాగే నవీన్ పోలిశెట్టి కూడా కేవలం కామెడీ నే నమ్ముకుంటే అతనికి కూడా అలాగే జరగచ్చేమో
చివరగా : నవ్వుకునే ఓపిక ఉంటే (మరేదీ వద్దు అనుకుంటే ) హాయిగా నవ్వుకోవచ్చు సినిమాలో కథ కూడా కావాలి అంటే నిరాశ తప్పదు

ఇది పాఠకుని అభిప్రాయం మాత్రమే