అవును ఇది నిజమే బొద్దుగుమ్మ రాశికన్నా ఇప్పుడు సీరియల్ లో నటించబోతున్నారు అదికూడా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన బొద్దుగుమ్మ రాశికన్నా కు ఆ చిత్ర తో మంచి గుర్తింపే లభించింది

ఆ తర్వాత వెనక్కి చుస్కోకుండా చాలా తెలుగు , తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది అయితే కెరీర్ మంచి ఊపులొ ఉంది అనుకున్న సమయంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే ఆ చిత్రం అనుకున్న విధంగా హిట్ అవ్వక తన కెరీర్ నీ డైలమా లో పడేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చిత్రంలో కూడా ఈ భామ నటించలేదు
ఇకపోతే సాయిధరమ్ తేజ తో ప్రతి రోజు పండగే సినిమాలో ” టిక్ టాక్ ఫేమ్ ఏంజెల్ అరుణ” అనే కారెక్టర్ తో మంచి గుర్తింపే వచ్చింది.

ఇక ఇప్పుడు అదే పాత్రతో పూర్తి స్థాయి లో డైరెక్టర్ మారుతి ఈ బొద్దుగుమ్మ ను పెట్టి సినిమా తీయబోతున్నాడు ఇందులో రాశికన్నా సీరియల్ హీరోయిన్ గా నటించబోతోంది
వైవిధ్య భరితమైన సినిమాలు తీయడంలో మారుతి ది అందే వేసిన చేయి అతని సినిమాలు ఆద్యంతం నవ్వుకుంటూ ఉండేలా తీయడం లో మంచి నేర్పరి అన్న విషయం తెలిసిందే ఇక ఈ చిత్రం దీపావళి కి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది అయితే ఈ సినిమా కు ఇప్పటి వరకు ఏటువంటి పనులు మొదలెట్ట లేదని కరోనా మరోసారి విజృంభిస్తున్న సమయంలో దీన్ని ఎలా మొదలెట్టాలి అని ఆలోచిస్తున్నారట