పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఫాన్స్ కి పూనకాలే దాదాపు 3 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ నటిస్తున్న సినిమా వస్తుంది అంటే ఫాన్స్ కి పండగ ఇటీవల విడుదల అయినా పింక్ రీమేక్ వకీల్ సాబ్ వసూళ్ల పరం గా కథా బలంగా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టింది సినిమాలో ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ మేనరిజం నెక్స్ట్ లెవెల్ నిజంగా చెప్పాలంటే ఫాన్స్ కి ఫుల్ మీల్స్ తిన్న సంబరం గా ఉంది అనడం అతిశయోక్తి కాదు కానీ ఒక్క విషయంలో మాత్రం వకీల్ సాబ్ వెనుక బడింది అని చెప్పక తప్పడంలేదు అదేంటంటే రేటింగ్

ఈ సినిమా హిందీ లో అమితాబ్ నటించిన విషయం తెలిసిందే అక్కడ ఈ సినిమా వసూళ్ల పరంగా , కథా పరంగా కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి తగినంత గుర్తింపు లభించింది
ఇకపోతే ఇదే సినిమాని తమిళ్ లో అజిత్ నెర్కొండ పార్వీ పేరుతో తెరకెక్కించారు అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది
అయితే ఒకే కథ ని కొన్ని మార్పుల చేర్పులతో మూడు భాషల్లో తెరకెక్కించడం అనేది అరుదైన విషయమే ఈ విషయంలో ఏ చిత్రం అత్యధిక రేటింగ్ ని ,దక్కించుకుంది అంటే మాత్రం మాతృక పింక్ కె ఆ అవకాశం దక్కింది అనాలి కానీ ఈ రేటింగ్ ని ఎవరు ఇచ్చారు అనే కదా మీ అనుమానం అక్కడికే వస్తున్నా
అదే IMDB ప్రఖ్యాతి గాంచిన మూవీ రేటింగ్ ప్లాట్ఫారం IMDB గురించి సినిమా ప్రేక్షకులకు కొత్త్తగా చెప్పాల్సిన పని లేదు
ఇందులో బాలీవుడ్ పింక్ కి 10 కి 8.1 | నెర్కొండ పార్వీ కి 10కి 8.0 | వకీల్ సాబ్ కి 10 కి 7.8 రేటింగ్ ఇచ్చారు

ఆ విధంగా చూస్తే మిగిలిన రెండు చిత్రాల కంటే వకీల్ సాబ్ కాస్త వెనుకబడ్డట్టే కానీ తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రం వకీల్ సాబ్ ఒక విందుభోజనం లాంటి సినిమా నే ఇందులో ఎటువంటి సందేహం లేదు