• సమావేశంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ
    సమైక్య రాష్ట్రం లో తెలంగాణా ప్రాంతం ఎంత వివక్షతకు గురి అయ్యిందో అలాగే కమిషన్ కూడ అంతే వివక్షతకు గురి అయిందని చెప్పారు… గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ తో ఏర్పాటు అయిన మన కమిషన్ తెలంగాణా ఎస్సీ ఎస్టీ కమిషన్ దేశానికే గర్వకారణంగా నిలిచింది అని అలాగే పీసీఆర్ పీవోఏ చట్టాల అమలు కమిషన్ ఏర్పాటు అయ్యే నాటికి కేవలము 26 మండలాల్లో మాత్రమే జరుగుతుంది అని కానీ మన కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత 500 పైగా మండలాల్లో రాష్ట్రంలో ఉన్న 12000 గ్రామాలకు 8621 గ్రామాల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నది.
    అలాగే 10500 కేసులు పెండింగ్ ఉండే అలాగే సెప్టెంబర్ 30 నాటికి 8000 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు, విజిలెన్స్ మానిటరింగ్ లో అద్భుతంగా పని చేస్తుంది అని అన్నారు.. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ ల కోసం 338 ఆర్టికల్ రచించారు..సెక్షన్ 12 ప్రకారం సివిల్ కోర్టు కు ఉండే అధికారాల. ఉంటాయని, అలాగే కోర్ట్ జరిగే సమయంలో
    సివిల్ కోర్టు కు ఉండే అధికారం ఉంటుంది అని ,ఎస్సీ ఎస్టీ ల కేసుల విచారణలో బాధితుల పట్ల వివక్ష చూపిన ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించిన ఆ అధికారులకి సమన్లు జారీచేసే అధికారం ఉంటుంది అని తెలిపారు,
    కేవలము ఎస్సీ ఎస్టీ వర్గాలే కాకుండా మిగిలిన వర్గాలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు, ముఖ్యమంత్రి గారి కలల రాష్ట్రం దిశగా కమిషన్ ముందుకు వెళ్తుందని అలాగే అధికారులూ ప్రజా ప్రతినిధులు తమ వంతు కృషి చేయాలని కోరారు..
    అనంతరం జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న కేసుల మీద అడిగి వివరణ కోరగా అందుకు అధికారులు కమిషన్ ముందర పెండింగ్ కేసుల తరుపున వివరణలు ఇవ్వగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు… ఈ కార్యక్రమంలో కమీషన్ సభ్యులు విద్యాసాగర్ గారు, రాంబల్ నాయక్ గారు, జిల్లా కలెక్టర్లు ,పోలీస్ ఉన్నాధికారులు, మరియు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు*