జనసేన పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… పార్టీలో తన సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముగిసిన తరువాత పార్టీ పరిస్థితి, ఓటమికి గల కారణాలపై సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్… పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి నాయకులకు, కార్యకర్తలకు మధ్య వారధిగా ఉంచాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

కీలకమైన ఈ కమిటీ సారథ్య బాధ్యతలను నాగబాబుకు అప్పగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చారని జనసేన వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పార్టీలో నాయకులకు, శ్రేణులకు మధ్య సమన్వయం లేకపోవడం కూడా పార్టీ ఘోర ఓటమికి ఓ కారణమనే భావనలో ఉన్న పవన్ కళ్యాణ్… ఇకపై ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. జనసేనలో పవన్ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న నేత మరొకరు లేకపోవడంతో… పార్టీలో అందరూ గుర్తించే నాయకుడు మరొకరు లేకపోవడం వల్లే సమన్వయ కమిటీ బాధ్యతను నాగబాబుకు అప్పగిస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

త్వరలోనే అమెరికాలో జరిగే తానా సభలకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్… ఈ పర్యటనకు ముందే సమన్వయ కమిటీ బాధ్యతలను నాగబాబుకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీలో నాయకులకు, శ్రేణులకు మధ్య సమన్వయం లేకపోవడం కూడా పార్టీ ఘోర ఓటమికి ఓ కారణమనే భావనలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఇకపై ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.